హైదరాబాద్, సెప్టెంబర్ 21: హైదరాబాద్ నుంచి కొలంబో మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. వచ్చే నెల 2 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సర్వీసు ఈ రెండు నగరాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ఇదే కావడం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్లో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఈ నూతన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. మరోవైపు ఉడాన్ స్కీంలో భాగంగా హైదరాబాద్-నాగపూర్-అజ్మీర్ మధ్య విమాన సర్వీసును ఈ నెల 30 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు స్టార్ ఎయిర్ ప్రకటించింది.