SBI-Reliance | ఎస్బీఐతో రిలయన్స్ జట్టు.. రెండు క్రెడిట్ కార్డుల ఆవిష్కరణ.. ఇవీ బెనిఫిట్లు..!
SBI-Reliance | ఇప్పటి వరకు వివిధ రకాల సేవలందించిన రిలయన్స్ క్రెడిట్ సేవల్లోకి ఎంటరైంది. ఎస్బీఐతో కలిసి ‘రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ ఆవిష్కరించింది.
SBI-Reliance | దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆధ్వర్యంలోని ఎస్బీఐ కార్డ్, కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్ జట్టు కట్టాయి. ‘రిలయన్స్ ఎస్బీఐ కార్డు’ అనే పేరుతో రెండు కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించాయి. ఈ క్రెడిట్ కార్డులతో రిలయన్స్ రిటైల్ ఔట్ లెట్లలో కొనుగోళ్లతో రివార్డులు లభిస్తాయి. ఫ్యషన్, లైఫ్ స్టైల్, గ్రాసరీ, కన్జూమర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫర్నీచర్, జ్యువెలరీ కొనుగోళ్లపైనా రివార్డులు పొందొచ్చు. అలాగే ఎస్బీఐ ఎప్పటికప్పుడు అందించే ఆఫర్లు అందుకోవచ్చు.
రూపే నెట్‌వర్క్‌పై ‘రిలయన్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ పని చేస్తాయి. యూపీఐ యాప్ లకూ అనుసంధానించవచ్చు. రిలయన్స్ ఎస్బీఐ కార్డ్, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ పేరుతో వస్తున్నాయి. రిలయన్స్ ఎస్బీఐ కార్డు ఏడాది ఫీజు రూ.499, రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ ఫీజు రూ.2,999గా ఖరారు చేశారు. ఆయా కార్డుల వాడకంపైనా వచ్చే రివార్డు పాయింట్లలోనూ తేడాలు ఉంటాయి.
రిలయన్స్ ఎస్బీఐ కార్డు తీసుకునే వారు రూ.499 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. ఈ కార్డు దారులకు వెల్ కం బెనిఫిట్ కింద రూ.500 విలువ గల రిలయన్స్ రిటైల్ ఓచర్ అందిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష పై చిలుకు కొనుగోళ్లపై తదుపరి ఏడాది ఫీజు మాఫీ చేస్తారు. రిలయన్స్ రిటైల్ స్టోర్ లో కొనుగోళ్లపై ప్రతి రూ.100లకు ఐదు రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఫ్యుయల్ సర్ చార్జి లేదు. ట్రెండ్స్, అసియో, సెంట్రో, అర్బన్ లేడ్, జియోమార్ట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఐదు శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ తీసుకునే వారు రూ.2,999 ఫీజు చెల్లించాలి. వెల్ కం బెనిఫిట్ కింద రూ.3000 విలువ గల రిలయన్స్ రిటైల్ ఓచర్ ఇస్తారు. ఏడాదిలో రూ.3 లక్షల పై చిలుకు కొనుగోళ్లు జరిపితే వార్షిక ఫీజు మాఫీ అవుతుంది. రిలయన్స్ స్టోర్‌లో ప్రతి రూ.100 కొనుగోలుపై 10 రివార్డు పాయింట్లు పొందొచ్చు. బుక్ మై షోలో ప్రతి నెలా రూ.250 విలువ గల సినిమా టికెట్, దేశీయ విమానాశ్రయాల్లో ఏటా ఎనిమిది లాంజ్ యాక్సెస్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నాలుగు లాంజ్ యాక్సెస్‌లు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

