Economic Survey | వచ్చే ఏడాది వృద్ధిరేటు తగ్గుముఖమే.. నిగ్గు తేల్చిన ఆర్థిక సర్వే
Economic Survey | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో భారత్ వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
Economic Survey | వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ఆర్థిక వృద్ధిరేటు తగ్గుముఖం పడుతుందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వృద్ధిరేటు ఏడు శాతం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది 6.5 శాతం ఉండొచ్చునని ఆర్థిక సర్వే తెలిపింది. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభకు సమర్పించారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రతిపాదించడానికి ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను వెల్లడించింది.
ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇవే..
- 2023-24లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.5 శాతం ఉంటుంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సర జీడీపీ తక్కువగా ఉంటుందని అంచనా వెల్లడించినా.. అతిపెద్ద సంపన్న దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుంది.
- వచ్చే ఆర్థిక సంవత్సర జీడీపీపై దేశీయంగా ఆర్బీఐతోపాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల అంచనాలకు అనుగుణంగా ఆర్థిక సర్వే.
- అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలను బట్టి వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతం మధ్య ఉంటుదన్న ఆర్థిక సర్వే.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసినట్లు ఏడు శాతం కంటే 2023-24 వృద్ధిరేటు తక్కువగా ఉంటుందని అంచనా వేసినా.. జీడీపీ వృద్ధిరేటు 6-6.8 శాతం మధ్య ఉంఉటందని కేంద్రం ఆశాభావం.
- వృద్ధిరేటు అంచనాలు తగ్గినా కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు పలు ప్రయోజనాలు ఉన్నాయి.
- ప్రస్తుతం చైనాలో కరోనా కేసుల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా భారత్‌తోసహా పలు దేశాల సప్లయ్ చైన్ యధాతథం.
- సంపన్న దేశాలను ఆర్థిక మాంద్యం ముప్పు వెంటాడుతున్నా భారత్‌కు నిధుల వరద పోటెత్తుతుందని అంచనా.
- వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం ఆరు శాతంలోపే. ఫలితంగా వచ్చే ఏడాది ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయన్న ఆర్థిక సర్వే.
- వచ్చే ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనా వేసిన ఆర్థిక సర్వే.. ఈ ఏడాది ఎకానమీ తీరుపైనా సమీక్షించింది.
- ఇటీవలి కాలంలో టెక్ దిగ్గజ సంస్థలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఆర్థిక మాంద్యం ముప్పు భయాలను తెలియ జేస్తున్నదని పేర్కొంది.
- కరోనా మహమ్మారి నుంచి శరవేగంగా కోలుకున్న భారత్.
- దేశీయంగా డిమాండ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పుంజుకోవడంపైనే వృద్ధిరేటు ఆధార పడి ఉంటుంది.
- 2022-ఏప్రిల్‌లో గరిష్ఠ స్థాయిని తాకిన ద్రవ్యోల్బణం. అంతర్జాతీయ పరిణామాల వల్లే ముప్పు ఎక్కువ.
- సుదీర్ఘకాలం అత్యధికంగా ద్రవ్యోల్బణం నమోదుతో ద్రవ్య లభ్యత పరిస్థితులను కఠినతరం చేసిన ఆర్బీఐ-వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు.
- ద్రవ్య పరపతి కఠినతరం చేయడంతో సంపన్న దేశాల్లో మందగించిన ఆర్థిక కార్యకలాపాలు.
- ద్రవ్య లభ్యత కఠినతరంతో మరో సమస్య ముంచుకొచ్చిందన్న ఆర్థిక సర్వే. నెమ్మదించిన వడ్డీరేట్ల పెంపు.
- ఆందోళనకర స్థాయిలోనే ద్రవ్యోల్బణం కొనసాగుతుందని పునరుద్ఘాటించిన ప్రధాన దేశాల సెంట్రల్ బ్యాంకులు.
Finance Minister Nirmala Sitharaman tables the Economic Survey 2022-23 in Parliament pic.twitter.com/sUMW7RAkWx
— ANI (@ANI) January 31, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

