ముంబై, మే 20: రూపాయి మరింత దిగజారింది. వరుసగా తొమ్మిదిరోజూ బుధవారం కూడా చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు కోల్పోయి 96.86కి జారుకున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలుండటం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం రూపాయి పతనానికి ఆజ్యంపోసింది.
96.89 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 96.95కి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 16 పైసలు కోల్పోయి 96.86 వద్ద నిలిచింది. గత సెషన్లో రూపాయి 50 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.