Aadhar | అన్నింటికీ ఆధార్ సరికాదు.. ప్రశ్నార్థకంగా 12 అంకెల బయోమెట్రిక్ టెక్నాలజీ: రేటింగ్ ఏజెన్సీ మూడీస్
రేషన్ కార్డుకు.. బ్యాంక్ ఖాతాలకు.. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు.. ఆర్థిక కార్యకలాపాలకు.. గ్యాస్ సబ్సిడీలకు.. ఓటేసేందుకు.. మొబైల్ సిమ్‌కు.. చివరకు జనన, మరణాలకు.. ఇలా అన్నింటికి ‘ఆధార్' ఒక్కటే ఆధారం. దేన్ని ధ్రువీకరించాలన్నా ఇది తప్పనిసరి.
Aadhar | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: రేషన్ కార్డుకు.. బ్యాంక్ ఖాతాలకు.. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు.. ఆర్థిక కార్యకలాపాలకు.. గ్యాస్ సబ్సిడీలకు.. ఓటేసేందుకు.. మొబైల్ సిమ్‌కు.. చివరకు జనన, మరణాలకు.. ఇలా అన్నింటికి ‘ఆధార్’ ఒక్కటే ఆధారం. దేన్ని ధ్రువీకరించాలన్నా ఇది తప్పనిసరి. అయితే దేశంలో ఇంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆధార్‌ను.. ప్రస్తుత విధానాన్ని దండగగా పేర్కొన్నది ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్. ఈ 12 అంకెల బయోమెట్రిక్ టెక్నాలజీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందంటూ హెచ్చరించింది మరి. నిజానికి దాదాపు ఏడాదిన్నర క్రితం భారతీయ అత్యున్నత ఆడిటర్.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సైతం ఆధార్ లోపాలను ఎత్తిచూపడం గమనార్హం. డాటా నిర్వహణ లోపభూయిష్టంగా ఉందంటూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తినే వ్యక్తం చేసింది.
మూడీస్ ఏమంటున్నది?
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను పొందేందుకు ఆధార్‌ను కీలకం చేశారన్న మూడీస్.. అన్ని రకాల సర్కారీ సంక్షేమ పథకాల ప్రయోజనాలనూ దీనితోనే ముడి పెట్టారని గుర్తుచేసింది. అయితే ఇంతటి ప్రధాన వ్యవస్థ విశ్వసనీయంగా లేకుంటే దేశ ప్రజలకు నష్టమేనని చెప్తున్నది. ముఖ్యంగా ఈ సమాచారంలో తప్పుల వల్ల అర్హులు ప్రభుత్వ రాయితీలను, ఇతరత్రా చేయూతల్ని అందుకోలేకపోతున్నారని చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారని గుర్తుచేసిన మూడీస్.. అలాంటి వారందరికీ ఆధార్ వ్యవస్థలోని లోపాలు ఇబ్బందికరంగా మారాయన్నది. రోజువారీ శ్రామికులు సైతం ఆధార్‌తో నష్టపోతున్నారన్నది. మొత్తంగా ఉష్ణ, తేమతో కూడిన భారతీయ వాతావరణానికి ఆధార్ ప్రామాణిక సేవలు, విధానాలు సరిపోవని కుండ బద్దలు కొట్టింది.

ఇంకా ఏం చెప్పిందంటే?
- ఈ ఏడాది జూలై 31 నాటికి దేశంలో 76.53 కోట్ల మంది తమ రేషన్ కార్డులను, ఆధార్‌ను లింక్ చేసుకున్నారు.
- 28 కోట్లకుపైగా భారతీయులు వంటగ్యాస్‌తో ఆధార్‌ను జత చేసుకున్నారు.
- 78.8 కోట్లకుపైగా బ్యాంక్ ఖాతాదారులు ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.
- ఆధార్ ద్వారానే పీఎంకెవై కింద 100 శాతం రైతులు లబ్ధి పొందుతున్నారు.
- కానీ తప్పుడు సమాచారంతో అనర్హులు లబ్ధి పొందుతుంటే, అర్హులు నష్టపోతున్నారు.
- ముఖ్యంగా రేషన్ పంపిణీలో, గ్యాస్ సబ్సిడీలో బాధితులు అధికంగా ఉన్నారు.

‘జార్ఖండ్‌లో సంభవించిన ఆకలి చావులకు ఆధార్ బయోమెట్రిక్స్ వైఫల్యాలనే చూపుతున్నారు. వీరందరికీ పీడీఎస్ల ద్వారా రేషన్ అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.’
-లావణ్య తమంగ్, లిబ్టెక్ సీనియర్ మేనేజర్
‘సమాచార లోపాలు, ప్రామాణిక తప్పిదాలు ఆధార్ విధానంలో కనిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లోనైతే పదేండ్ల తర్వాత కూడా ఆధార్ కార్డులోని వివరాలు, ఆ కార్డుదారుల అసలు వివరాలతో సరితూగడం లేదు. డాటా నిర్వహణలో యూఐడీఏఐ వైఫల్యం స్పష్టంగా బయటపడుతున్నది’
-గత ఏడాది నివేదికలో కాగ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- aadhar
- bank accounts
- Biometric
- CAG
RELATED ARTICLES
తాజా వార్తలు
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

