ITR-U | ఆన్లైన్ గేమ్స్ ఇన్‌కం.. ఐటీఆర్-యూ ఫైల్ చేయాల్సిందే.. తేల్చేసిన సీబీడీటీ
ITR-U | ఆన్లైన్ గేమ్స్‌లో వచ్చే ఆదాయంపై ఐటీఆర్-అప్డేట్ సమర్పించాల్సిందేనని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తేల్చేశారు.
ITR-U | గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆన్లైన్ గేమ్స్, లాటరీ, బెట్టింగ్‌లు ద్వారా ఆదాయం పొందినా ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీ రిటర్స్)లో తెలియజేయాల్సిందే. ఒకవేళ పొరపాటున ఇటీవల సబ్మిట్ చేసిన ఐటీఆర్‌లో ఆ వివరాలు మిస్ అయినా.. వెంటనే అప్డేట్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కోరింది. ఐటీ రిటర్న్స్ -అప్డేట్ లేదా ఐటీఆర్-యూ ఫామ్ కింద అప్డేటెడ్ ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టం కింద పెనాల్టీ, ఇతర చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే కంటే పన్ను చెల్లించడానికి ఇది ఒక ఆప్షన్ అని సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఐటీఆర్-యూ అంటే..
ఆదాయం పన్ను రిటర్న్స్-అప్డేటెడ్కు షార్ట్ ఫామ్ ఐటీఆర్-యూను గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 1961 ఆదాయం పన్ను చట్టం 139 (8ఏ) సెక్షన్ కింద పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-యూ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
పొరపాట్లు సరిదిద్దుకోవడానికే..
పన్ను చెల్లింపుదారులు తమ పొరపాట్లను తేలిగ్గా సరిదిద్దుకోవడానికి ఐటీఆర్-యూ ఆప్షన్ తీసుకొచ్చారు. అయితే, ఐటీఆర్-యూ ఫామ్ సబ్మిట్ చేయడానికి సరైన కారణాలను సంబంధిత పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా తెలియజేయాలి. ఇంతకుముందు ఐటీఆర్ సబ్మిట్ చేయకున్నా, ఆదాయం వివరాలు సరిగ్గా రిపోర్ట్ చేయకున్నా అప్డేట్ చేస్తున్నట్లు తెలపాలని సీబీడీటీ పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు అదనపు ఆదాయం వివరాలు బయట పెట్టినప్పుడు మాత్రమే ఐటీఆర్-యూ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ అంచనాలు సమర్పించిన సంవత్సరం నుంచి రెండేండ్లలోపు ఐటీఆర్-యూ దాఖలు చేయొచ్చు.
ఈ ఏడాది 2020-21, 2021-22 ఐటీఆర్-యూ సబ్మిట్ చేయొచ్చు
అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల ఐటీఆర్లపై అప్డేట్లు సమర్పించవచ్చు. టాక్స్ పేయర్లు తమ ఆదాయం వివరాలు ఐటీఆర్‌లో ఫైల్ చేయడం మరిచిపోయిన వారి కోసమే ఐటీఆర్-యూ ఆప్షన్ తీసుకొచ్చింది సీబీడీటీ. అయితే, ఐటీఆర్-యూ ఫామ్ సబ్మిట్ చేసేవారు.. అదనపు ఇన్‌కంపై 25 నుంచి 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్-యూ దాఖలు చేసిన టాక్స్ పేయర్లు దాదాపు రూ.28 కోట్ల పన్ను చెల్లించిందని ఆదాయం పన్నుశాఖ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cbdt
- ITR-U
- Online Games
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

