ఖర్చుల్లో.. ఆదా ఇలా..
గత ఏడాది కాలంగా వేతనాలు, రాబడుల్లో కోత. కొత్తగా ఇంక్రిమెంట్లు, బోనస్‌ల జాడే లేదు. కొంత మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఖర్చులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. కరోనా మహమ్మారితో ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చులు పెరిగాయి. ఇలాంటి సందర్భంలో ఇక పొదుపు గురించి ఆలోచనకు తిలోదకాలిచ్చిన వారెందరో. అయితే ఇప్పటికీ కొన్ని రకాల పొదుపులను చేయక తప్పదు. అలాగే కొన్ని రకాల అప్పుల నుంచి బయటపడకా తప్పదు. అవేంటో చూద్దాం.
సినిమాలు, షికార్లు పోవడానికి అవకాశాలు లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇప్పటికీ ఇంకా చాలా ఐటీ కంపెనీలు అనుసరిస్తున్నాయి. టీవీ ముందు కూర్చుని ఓటీటీ వేదికల్లో సినిమాలు చూడడం ఈ సంవత్సర కాలంలో చాలా పెరిగింది. వీటి సబ్ స్క్రిప్షన్లతోపాటు వీటిని చూడ్డానికి మళ్లీ ఇంటర్నెట్ స్పీడ్ కోసం మరింత అదనపు ఖర్చు. వీటిని తగ్గించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంటర్నెట్ స్పీడ్ అవసరమే అయినా ఓటీటీలను తగ్గించండి. అలాగే ఇష్టమైన రెస్టారెంట్లకు వెళ్లడమో లేకా ఇంటికే ఆర్డర్ చేయడమో ఆపండి. ఇంటిపట్టునే ఉంటున్నారు కనుక హాయిగా వంట చేసుకుని తినేయండి. కరోనా కారణంగానైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి.
ప్రతి పైసా ఆదా
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ పైసా విలువైందే. రోజువారి అవసరాలకు, అనవసర వ్యయాలకు తేడా తెలుసుకోండి. నెలసరి బడ్జెట్ కనీసం కొంతైనా తగ్గించేందుకు నడుం బిగించండి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీ పొదుపులపై కోతను తగ్గించకుండా చూడండి. పెట్రోల్ ధరలు భారీగా పెరిగినందున, చిన్న చిన్న దూరాలకు కూడా బండిని వాడటం మానేయండి. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వాడండి.
క్రెడిట్ కార్డులను పక్కన పెట్టండి
క్రెడిట్ కార్డులను తప్పనిసరి అయితే తప్ప ఉపయోగించకండి. దాని మీద వడ్డీ.. చక్రవడ్డీకన్నా అన్యాయంగా ఉంటుంది మరి. దానికి బదులుగా సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉన్న నగదునే పొదుపుగా వాడుకోండి. క్రెడిట్ కార్డుపై ఇప్పటికే ఉన్న అప్పును కూడా తగ్గించేయండి. దీనివల్ల కూడా చాలా పొదుపు చేయవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పును మించిన శత్రువు లేదు.
పెద్ద ఖర్చులకు దూరం
మీ నెలసరి ఆదాయంలో అత్యధికంగా తినేస్తున్న పెద్ద ఖర్చులేమిటో గుర్తించండి. సంపాదనలో కనీసం 30 శాతం అద్దె కోసమే చెల్లించేవారు చాలా మంది. దీన్ని ఎలా తగ్గించవచ్చో ఆలోచించండి. అలాగే విలాసాలు, వినోదాలను తగ్గించడం కాదు.. ఏకంగా మానేయండి ప్రస్తుతానికి. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ వాటి జోలికి వెళదాం.
ప్రత్యామ్నాయ ఆదాయాలు
జీతాలే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి. మీకు మీరు చేయగలిన అదనపు పనులేమిటో గుర్తించి వాటి కోసం ప్రయత్నించండి. అందువల్ల వచ్చే ఆదాయం చిన్నదే అయినా సరే అదే మిమ్మల్ని నిలబెడుతుంది. ఇప్పటికే చేస్తున్న పొదుపులేవీ ఆపకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. పరిస్థితులు అనుకూలించేదాక అదనంగా కొన్ని గంటలైనా పనిచేయండి.
ఆపకూడనివి
ఈ కాలంలో అస్సలు ఆపకూడని వాటిలో ఆరోగ్య బీమా. ఆరోగ్య సమస్యల వల్ల మెడికల్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. హాస్పిటలైజేషన్ మరీ ఎక్కువయ్యాయి. ఆరోగ్య బీమా లేకపోతే ఆర్థికంగా మరింత చితికిపోవడం కన్నా.. దానికోసం ఎంత ఇబ్బంది అయినా సరే ప్రీమియం చెల్లింపులను మరవకండి. ఆరోగ్య బీమా లేకపోతే మిగతా ఖర్చులు తగ్గించైనా తీసుకోండి. పిల్లల భవిష్యత్, మీ రిటైర్మెంట్ల కోసం చేసే పొదుపునూ ఆపొద్దు. ఇప్పుడు చేయాల్సింది ఖర్చులు తగ్గించడమే కానీ.. పొదుపులను కాదు.
సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అధిక వడ్డీ
వడ్డీరేట్లను తగ్గిస్తున్న ప్రధాన బ్యాంకులు సీనియర్ సిటిజన్ల పొదుపుపై మాత్రం అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అధిక వడ్డీని చెల్లిస్తున్నాయి. వీటిలో బ్యాంకిం గ్ దిగ్గజం ఎస్బీఐతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి.
- ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ స్కీం: సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని చెల్లిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. సాధారణ ప్రజలలకు 5.4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..సీనియర్ సిటిజన్లకు మాత్రం 6.20 శాతం చెల్లిస్తున్నది. ఐదేండ్ల కాలపరిమితితో కూడిన డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ వర్తించనున్నది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్: 75 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి హెచ్డీఎఫ్సీ బ్యాంక్. దీంతో సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.
- ఐసీఐసీఐ బ్యాంక్: ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 80 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీని చెల్లిస్తున్నది. దీంతో వడ్డీరేటు 6.30 శాతంగా ఉన్నది.
- బీవోబీ: అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది బీవోబీ. సాధారణ డిపాజిట్ల కంటే 100 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీని చెల్లిస్తున్నది. దీంతో వడ్డీరేటు 6.25 శాతంగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- expenses
- save money
- savings
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

