భద్రం.. బీకేర్‌ఫుల్ బ్రదర్
ప్రతీ ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అయితే అది లేక కొందరు, అది ఉన్నప్పటికీ అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరికొందరు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటున్నారు. మరి నిపుణులేమంటున్నారో చూద్దాం.
- ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అంతే సంగతి..
ప్రతీ ఒక్కరికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అయితే అది లేక కొందరు, అది ఉన్నప్పటికీ అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరికొందరు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటున్నారు. మరి నిపుణులేమంటున్నారో చూద్దాం.
అవగాహనతో..
ప్రతీదానిపై అవగాహన ఉంటేనే లాభమైనా.. విజయమైనా దక్కుతుంది. ముఖ్యంగా ఎలాంటి అవగాహన లేకుండా, విచారణ చేయకుండా తొందరపడి నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం నష్టాలకు దారితీయవచ్చు. స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ చేసి, పూర్తిగా రిసెర్చ్ చేశాకే ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం. ఈక్విటీ మార్కెట్లపై అవగాహనను పెంచుకోవడానికి అసలు సమయమే లేని చిన్న మదుపరులు ఈ పెట్టుబడులకు దూరంగా ఉండటమే లాభదాయకం. అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు దిగడం ఒకింత తెలివైన పనేనని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ మీకొచ్చే ఆదాయం మార్కెట్ ఒడుదొడుకులకు లోబడే ఉంటుందన్నది మరువద్దు. మొత్తానికి ఎక్స్పర్ట్స్ సలహాలతో ముందుకెళ్తేనే ప్రయోజనం.
అతితో అనర్థాలే..
కొందరు ఏం చేసినా అపరిమిత స్థాయిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే విపరీతంగా స్టాక్స్‌ను కొంటూంటారు. అలాగే ఫండ్స్‌నూ అదేస్థాయిలో రకరకాల పెట్టుబడి సాధనాల్లోకి మళ్లిస్తూ ఉంటారు. అయితే వైవిధ్యం అనేది వ్యూహమే అయినా.. ఒక మోతాదు దాటితే దుష్పరిణామాలకే దారితీస్తుంది. ఓ సర్వే ప్రకారం మీ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాల నుంచి 15-20 శాతం స్టాక్స్.. మీకున్న రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇంతకు మించితే ఎటువంటి లాభమూ దక్కదు. కాబట్టి స్టాక్స్ కొనుగోలు, నిధుల మళ్లింపుల్లో అతి పనికిరాదు.
బీమాను మరువద్దు
ప్రతీది పన్ను కోణంలో చూడవద్దు. పెట్టుబడులైనా, బీమా అయినా పన్ను మినహాయింపులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా బీమా పాలసీల విషయంలో ఈ రకమైన ఆలోచన శ్రేయస్కరం కాదు. ఎందుకంటే పన్ను మినహాయింపుల కోసం బీమా పాలసీలను తీసుకుంటే.. కావాల్సిన ప్రయోజనాలను మీరు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు అవసరమైన బీమాలో భాగంగానే పన్ను ప్రయోజనాలు దక్కలిగానీ.. మొత్తం పాలసీనే నిరుపయోగంగా మార్చవద్దని హితవు పలుకుతున్నారు. అలాగే సమగ్రరీతిలో కవరేజీ ఉన్న పాలసీలనే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకటికి మించి బీమా పాలసీలుంటే మంచిదే అయినప్పటికీ.. మీమీ ఆర్థిక అనుకూలతలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
రుణ భారం
అవసరమున్నా, లేకున్నా నేడు చాలామంది మితిమీరిన రుణ భారాన్ని తలకెత్తుకుంటున్నారు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లతో కొందరు.. క్రెడిట్ కార్డు సంస్థల నుంచి వస్తున్న ప్రకటనలతో మరికొందరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనివల్ల జీవితంలో రాజీపడి బ్రతకాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి అప్పుచేసి పప్పుకూడు ఎప్పటికీ మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ-వ్యయాల మధ్య అంతరాలను తెలుసుకొని జీవించాలంటున్నారు. అనవసరపు కోర్కెలను తీర్చుకోవడానికి చేసే అప్పులు.. మున్ముందు గృహ రుణం వంటి కీలక లక్ష్యాల సాధనను ఆంటకపర్చే వీలుకూడా లేకపోలేదు. కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
చివరగా..
ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థోమతను తెలుసుకొని ప్రవర్తించాలి. ప్రధానంగా ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లో స్థిరత్వం లోపించింది. ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే కనీసం 6 నెలల అవసరాలు తీరేలా అత్యవసర నిధి ఉండాలి. సురక్షితమైన పెట్టుబడులకు పెద్దపీట వేస్తూనే.. పొదుపునకూ ప్రాధాన్యత ఇవ్వాలి. వీలుంటే రుణ భారాన్ని తగ్గించుకోవాలి. అవసరం మేరకే ఖర్చులుండాలి. విస్తృత శ్రేణి ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను తీసుకోండి. అడ్డగోలు రాబడులనిచ్చే మోసపూరిత స్కీములకు దూరంగా ఉండండి. తొందరపాటుతో కాకుండా ఓ ప్రణాళికతో ముందుకెళ్తే విజయాలు సొంతమవుతాయి.

పొదుపుతోనే రక్ష
పొదుపును ఎప్పుడూ అశ్రద్ధ చేయవద్దు. ప్రతీ వ్యక్తికి ఉండాల్సిన ఆర్థిక క్రమశిక్షణలో తెలివైన పెట్టుబడులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. పొందికైన పొదుపునకూ అంతే స్థానం ఉంటుంది. యుక్త వయస్సు నుంచే సేవింగ్స్‌ను అలవాటు చేసుకుంటే ఆకర్షణీయ లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా అనుకోని ఖర్చులను తేలిగ్గా అధిగమించవచ్చు. ఇక నేటి యువతలో చాలామందికి కెరియర్ ప్రారంభంలోనే మంచి ఉద్యోగాలు, పెద్ద జీతాలు దక్కుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు, ఖరీదైన మొబైల్ ఫోన్లు.. ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. కానీ అత్యవసర పరిస్థితుల కోసం సేవింగ్స్‌పై మాత్రం మొగ్గు చూపడం లేదు. కనుక పొదుపుపై నిర్లక్ష్య ధోరణి వీడాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

