ICICI Festive Bonanza | ఐసీఐసీఐ `ఫెస్టివ్ బోనంజా`.. క్యాష్‌బ్యాక్.. డిస్కౌంట్ల వరద!
ICICI Festive Bonanza | పండుగల సీజన్లో వస్తువుల కొనుగోళ్లపై ఐసీఐసీఐ బ్యాంక్ రూ.25 వేల వరకు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది.
ICICI Festive Bonanza | పండుగల సీజన్లో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోకి టీవీ.. మొబైల్ ఫోన్.. ల్యాప్ టాప్.. టాబ్లెట్ కొనుక్కోవాలని భావిస్తారు. వాషింగ్ మిషన్, సోఫా సెట్ తదితర వస్తువులు కొనడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇటువంటి వాటిపై ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు `ఫెస్టివ్ బోనంజా` ప్రకటించింది. వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు గురువారం వెల్లడించింది. తమ ఖాతాదారులు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫైనాన్స్, కార్డ్ లెస్ ఈఎంఐ వంటి సర్వీసులను ఉపయోగించి ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో వస్తువుల కొనుగోలుపై రూ.25 వేల వరకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది.
`మా కస్టమర్లకు ఫెస్టివ్ బోనంజా ప్రకటిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. ఖాతాదారుల కొనుగోళ్లు, ఖర్చులపై డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాం` అని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ ఝా తెలిపారు. ఇందుకోసం పలు అగ్రశ్రేణి బ్రాండ్లు, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, వివిధ శ్రేణుల ఉత్పత్తులు, సేవలతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనికి అదనంగా హోంలోన్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఆస్తులపై రుణాలు, పర్సనల్ లోన్, ఆటో లోన్, టూ వీలర్స్, గోల్డ్ లోన్లపై బ్యాంకింగ్ సొల్యూషన్స్ కల్పిస్తున్నాం` అని రాకేశ్ ఝా వెల్లడించారు.
ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు, అప్పారెల్స్, జువ్వెల్లరీ, గ్రాసరీ, ఆటోమొబైల్, ఫర్నీచర్, ట్రావెల్, డైనింగ్ తదితర క్యాటగిరీల్లో పండుగల వేళ కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు బ్యాంకు పలు ఆఫర్లు అందిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మైంత్రా, బిగ్ బజార్, బ్లింకిట్, మేక్ మై ట్రిప్, ఐఫోన్14, శ్యామ్ సంగ్, అజియో, రిలయన్స్ డిజిటల్, క్రోమా, ఎల్ జీ, డెల్, స్విగ్గీ, జొమాటో తదితర బ్రాండ్ల వస్తువుల కొనుగోళ్లు, సేవల వినియోగంపై ఈ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందొచ్చు. ఇండ్ల రుణాలు, పర్సనల్ లోన్లు, బంగారం రుణాలపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

