ICICI Bank Festive bonanza | పండుగల సీజన్ వచ్చేసింది.. ప్రతి ఒక్కరూ పండుగల వేళ తమకు ఇష్టమైనవీ.. కుటుంబ అవసరాలకు ఉపయోగపడేవీ కొనుగోలు చేస్తుంటారు. ఈ తరుణంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ `ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనంజా` ప్రకటించింది. రాయితీలు.. ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌ల రూపంలో ఆఫర్లు అందిస్తున్నది. గరిష్టంగా రూ.26 వేల బెనిఫిట్లు కల్పిస్తున్నది. తమ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపె క్రెడిట్ కార్డుతో యూపీఐ లేదా కార్డ్ లెస్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన ఖాతాదారులు ఈ ఆఫర్లు పొందవచ్చునని ఐసీఐసీఐ తెలిపింది. పండుగల సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రాలతో జత కట్టినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది.
కొన్ని బ్రాండ్ల ఉత్పత్తులపై 15 శాతం వరకూ రాయితీ..
ఎల్జీ, శాంసంగ్, యురేకా ఫోర్బ్స్, వర్ల్ పూల్ సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై రూ.26 వేల వరకూ క్యాష్ బ్యాక్
వన్ ప్లస్, ఆపిల్, మోటరోలా, షియోమీ, ఒప్పో, రియల్మీ సంస్థల స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫర్లు అభిస్తాయి. రూ.2457తో నెలవారీ ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం.
లైఫ్ స్టైల్, ఫాస్ట్ ట్రాక్, మైంత్రా, సెంట్రో సంస్థల్లో జరిపే ఫ్యాషన్ వస్తువుల కొనుగోళ్లపై అదనంగా 10 శాతం రాయితీ..
మేక్ మై ట్రిప్, యాత్ర, క్లియర్ ట్రిప్, ఈజీ మై ట్రిప్ వంటి ప్లాట్ ఫామ్స్ నుంచి ట్రావెలింగ్ బుకింగ్ మీద డిస్కౌంట్.
జొమాటో, ఈజీ డైనర్స్, స్విగ్గీ, మెక్ డొనాల్డ్స్ వంటి ఫుడ్ ఆర్డర్లపై తగ్గింపు.
సినీ పోలీస్’లో సినిమా టికెట్ల కొనుగోలు, సోనీ లివ్ వార్షిక సబ్ స్క్రిప్షన్ మీద ప్రత్యేక ఆఫర్లు. ఇక ఫర్నీచర్ బ్రాండ్ ఉత్పత్తులపై 10 శాతం వరకూ డిస్కౌంట్..