Zomato | జొమాటో డిస్కౌంట్లలో తేడాలు.. నిజాయితీ లేదని అంగీకరించిన సీఈఓ..?!
Zomato | జొమాటో ప్రకటించే ఆఫర్లు, ఆచరణలో తేడాలకు కారణాలను వివరించారు ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్. కానీ పోటీ వల్ల అలా చేయక తప్పట్లేదన్నారు.
Zomato | ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇచ్చే ఆఫర్ల గురించి సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ సంచలన విషయం ప్రకటించారు. జొమాటో ప్రకటించిన ఆఫర్లకు, ఆచరణలో వచ్చే డిస్కౌంట్‌కు చాలా తేడా ఉంటుంది. ఆఫర్ల ప్రకటన, అమలులో వ్యత్యాసం నిజమేనని చెప్పారు. కానీ అందుకు కారణాలు కూడా బయట పెట్టారు.
ఇతర యాప్ లతో పోటీ వల్లే తాము డిస్కౌంట్లు చూపాల్సి వస్తుందని రణబీర్ అనే యూ-ట్యూబర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ దీపిందర్ గోయల్ తెలిపారు. ఇలా డిస్కౌంట్లు చూపడం, కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. ఈ విధానాన్ని మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఓపెన్ చేస్తే 20-50 శాతం మధ్య డిస్కౌంట్లు ఊరిస్తూ ఉంటాయి. కానీ, బుక్ చేసిన తర్వాత తక్కువ డిస్కౌంట్ వస్తుందని యూజర్లకు అర్థమవుతూ ఉంటుంది. జొమాటో ఇచ్చే డిస్కౌంట్లు అంత పెద్దవి కాదని, కానీ అలా కనిపిస్తాయన్నారు దీపిందర్ గోయల్.
50 శాతం డిస్కౌంట్ అని ఉన్నా ఉదాహరణకు రూ.400 ఆర్డర్ పెడితే 50 శాతం డిస్కౌంట్ చూపుతుంది. కానీ రూ.80 మాత్రమే తగ్గుతుంది.. దీని ప్రకారం 20 శాతం డిస్కౌంట్ మాత్రమే ఇస్తున్నట్లవుతుందని దీపిందర్ గోయల్ చెప్పారు. ఈ తరహా డిస్కౌంట్లలో నిజాయితీ ఉందని తాను చెప్పబోనన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

