Hyundai Exter | 40+ సేఫ్టీ ఫీచర్లతో హ్యుండాయ్ ఎక్స్టర్.. లాంచింగ్ ఎప్పుడంటే?!
Hyundai Exter | హ్యుండాయ్ ఎక్స్టర్ 26 స్టాండర్డ్, 40 + సేఫ్టీ ఫీచర్లతో కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తున్నది.
Hyundai Exter | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి తన తొలి సబ్-4 మీటర్ ఎస్యూవీ కారు ఎక్స్టర్ (Hyundai Exter)ను ఆవిష్కరించనున్నది. అన్ని వేరియంట్లలో 6-ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్ వస్తున్నది. వచ్చేనెల 10 భారత్ మార్కెట్లో ఇప్పటికే ఆవిష్కరించనున్న హ్యుండాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు, 60+ బ్లూ లింక్ కనెక్టెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే హ్యుండాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ), ఎస్(ఓ) కనెక్ట్ ట్రిమ్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎక్స్ టర్ సింగిల్ టోన్, త్రీ డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది.
హ్యుండాయ్ ఎక్స్టర్ (Hyundai Exter) 26 స్టాండర్డ్, 40 + అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నది. అందులో అన్ని వేరియంట్లలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్, కర్టైన్, సైడ్) వస్తాయి. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు 3-పాయింట్ రేర్ సీట్ బెల్ట్స్, సీల్ బెల్ట్ రిమైండర్ (అన్ని సీట్లు), కీ లెస్ ఎంట్రీ, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్ఎస్, రేర్ పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి.
హెడ్ ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఆటో హెడ్ ల్యాంప్స్, చైల్డ్ ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ సీట్లు, రేర్ డీఫాగర్, రేర్ పార్కింగ్ కెమెరా, దస్ కామ్ విత్ డ్యుయల్ కెమెరాలు, టీపీఎంఎస్ (హైలైన్), బర్గర్ అలారం వంటి 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
మినీ ఎస్యూవీ సెగ్మెంట్లో తొలిసారి స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ వాయిస్ కమాండ్స్, డాష్ కామ్ విత్ (ఫ్రంట్ అండ్ రేర్) కెమెరాలు ఉన్నాయి. 2.31 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే విత్ దాస్ కామ్ కనెక్ట్ టు స్మార్ట్ ఫోన్ ఆప్షన్ ఉంటుంది. డ్రైవింగ్ (నార్మల్), ఈవెంట్ (సేఫ్టీ), వెకేషన్ (టైం లాప్స్) వంటి రికార్డింగ్ మోడ్స్‌లో అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

