Hyundai Creta N Line | 11న మార్కెట్లోకి హ్యుండాయ్ క్రెటా ఎన్-లైన్.. ఇవీ డిటైల్స్..!
Hyundai Creta N Line | ఇప్పటికే భారత్ మార్కెట్లో 2024 క్రెటా ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఆవిష్కరించిన హ్యుండాయ్ మోటార్ ఇండియా.. వచ్చేనెల 11న క్రెటా ఎన్-లైన్ ఆవిష్కరించనున్నది.
Hyundai Creta N Line | హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India).. ఇప్పటికే మిడ్ సైజ్ ఎస్యూవీ క్రెటా (Creta) అప్డేటెడ్ వర్షన్ ప్రారంభించింది. 60 వేలకు పైగా బుకింగ్స్ అందుకున్నది క్రెటా ఫేస్ లిఫ్ట్. తాజాగా వచ్చేనెల 11న క్రెటా ఎన్-లైన్ వర్షన్ ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 1.5-లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది హ్యుండాయ్ క్రెటా ఎన్-లైన్. ఈ ఇంజిన్ 5500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 158 బీహెచ్పీ విద్యుత్, 1500-3000 ఆర్పీఎం వద్ద 253 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
6-స్పీడ్ అండ్ 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్‌తో వస్తున్న హ్యుండాయ్ క్రెటా ఎన్-లైన్ 7-స్పీడ్ డీసీటీ వర్షన్ కూడా అందుబాటులోకి తెస్తున్నది. న్యూ బంపర్లతో రేర్ డిజైన్, స్పోర్టియర్ లుకింగ్ ఫ్రంట్ కలిగి ఉంటుంది. న్యూ అల్లాయ్ వీల్స్, డ్యుయల్ టోన్ పెయింటెడ్ రూఫ్ ఆప్షన్లతోపాటు న్యూ కలర్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నది. న్యూ మ్యాట్టె కలర్ ఆఫర్ ఆప్షన్ కూడా ఉంటుంది. రేర్‌లో ఫాక్స్ డిఫ్యూజర్, రేర్ అస్సెంట్స్తో ఎక్స్ టీరియర్ ఉంటుంది. స్పోర్టీ టచెస్‌తో ఇంటీరియర్ ఫీచర్లు డిజైన్ చేశారు. రెడ్ ఇన్సర్ట్స్తో డాష్ బోర్డు, రెడ్ బెజెల్‌తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. క్రెటా ఎన్-లైన్ వర్షన్ కార్లలో న్యూ గేర్ లివర్ కూడా జత చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

