Hyundai Creta N Line | హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఇవీ డిటైల్స్..!
Hyundai Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా (Hyundai Motors India) తన ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) కారును ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Hyundai Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా (Hyundai Motors India) తన ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) కారును ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో హ్యుండాయ్ డీలర్ల వద్దకు క్రెటా ఎన్ లైన్ కార్లు వచ్చి చేరుతున్నాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి 2024 క్రెటా ఎన్ లైన్ బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆన్‌లైన్‌లోగానీ, హ్యుండాయ్ సిగ్నేచర్ డీలర్‌షిప్‌ల వద్ద గానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2024 హ్యుండాయ్ క్రెటా కారు ధరలు రూ.11 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.20.15 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ధర పలుకుతాయి. అయితే, క్రెటా ఎన్ లైన్ కార్ల ధరలు సుమారు రూ.19-20 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతాయని భావిస్తున్నారు.
డబ్ల్యూఆర్సీ కార్ల స్ఫూర్తితో క్రెటా ఎన్ లైన్ డిజైన్ చేసినట్లు హ్యుండాయ్ తెలిపింది. ఎన్ లైన్ ఎంబ్లమ్‌తోపాటు న్యూ స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్లె, రెడ్ అసెంట్స్‌తోపాటు అగ్రెస్సివ్ ఫ్రంట్ బంపర్, న్యూ సైడ్ స్కర్ట్స్, ఎన్ లైన్ బ్యాడ్జింగ్తోపాటు 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్ జత చేశారు. స్పోర్టీ డిజైన్‌తో రేర్‌లో ట్విన్ టిప్ ఎగ్జాస్ట్, స్టాండర్డ్ క్రెటా కంటే స్పోర్టియర్‌గా, రాస్పియర్గా ఉంటుంది. హ్యాండిల్ బెటర్ కోసం సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.
42 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, 70కి పైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లతో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ వస్తున్నది. హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 6-ఎయిర్ బ్యాగ్స్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్లు ఉంటాయి. హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ కారు 1.5 లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 5500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 158 బీహెచ్పీ విద్యుత్, 1500-3500 ఆర్పీఎం వద్ద 253 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఇంజిన్ గేర్‌బాక్స్ 6-స్పీడ్ యూనిట్ లేదా 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ యూనిట్ ఉంటుంది. ఇప్పటికైతే క్రెటా ఎన్ లైన్ ఇంజిన్ 7-స్పీడ్ డీసీటీతో వస్తున్నది.
హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ ఇంటీరియర్ డిజైన్ మరింత స్పోర్టీ టచెస్ కలిగి ఉంటుంది. త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ అండ్ గేర్ లివర్ విత్ లెదర్ రాప్డ్ రెడ్ స్టిచింగ్ ఉంటుంది. ఎంపిక చేసిన ఎన్-లైన్ వర్షన్లలో మాత్రమే న్యూ గేర్ లివర్ అమరుస్తారు. ఇంటీరియర్ సెటప్ బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌తో ఫినిష్ చేశారు. డాష్ బోర్డు సైతం రెడ్ బెజెల్తోపాటు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

