Hyundai Creta facelift | వచ్చే ఏడాది ప్రారంభంలో హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ఇవీ ఫీచర్లు..!
Hyundai Creta Facelift | హ్యుండాయ్ తన క్రెటా ఫేస్ లిఫ్ట్ -2024 మోడల్ కారు మార్కెట్లోకి తేనున్నది. వచ్చే ఏడాది మార్చి త్రైమాసికంలో ఆవిష్కరించనున్నది.
Hyundai Creta facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా కార్లలో మిడ్‌సైజ్ ఎస్యూవీ క్రెటా.. బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హ్యుండాయ్ తన క్రెటా ఫేస్ లిఫ్ట్ -2024 మోడల్ కారు మార్కెట్లోకి తేనున్నది. వచ్చే ఏడాది మార్చి త్రైమాసికంలో ఆవిష్కరించనున్నది. భారత్ కార్ల మార్కెట్లో కీలక ప్లేయర్ పాత్ర పోషిస్తోంది క్రెటా. ప్రస్తుతం మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
2015 జూలైలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 9.50 లక్షల క్రెటా యూనిట్లు విక్రయించింది హ్యుండాయ్. 2024 మోడల్ క్రెటా కారు డిజైన్ లో పలు మార్పులు చేయనున్నది. హ్యుండాయ్ టస్కన్ తరహాలో రీ డిజైన్డ్ ఫ్రంట్ ఎండ్ ఫీచరింగ్ న్యూ గ్రిల్లె, న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రీవాంప్డ్ బంపర్, అప్ డేటెడ్ అల్లాయ్ వీల్స్, రేర్‌లో న్యూ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రీఫ్రెష్డ్ బంపర్ ఉన్నాయి.
స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ల కన్వీనెన్స్, సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) డెవలప్ చేశారు.
కియా సెల్టోస్‌లో మాదిరిగా క్రెటా ఫేస్ లిఫ్ట్ ఇంజన్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తోంది హ్యుండాయ్ మోటార్ ఇండియా. 1.5 లీటర్ల టర్బో-జీడీఐ పెట్రోల్ ఇంజిన్ (160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 పీఎస్ విద్యుత్, 144 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజిన్ (116 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్) ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంటెలిజెంట్ వారియబుల్ ట్రాన్స్మిషన్, 7-స్పీడ్ డ్యుయల్-క్లచ్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
ప్రస్తుత మోడల్ క్రెటా కారు రూ.10.87 లక్షల నుంచి రూ.19.20 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నది. అదనపు ఫీచర్లు జత చేస్తున్న నేపథ్యంలో 2024-క్రెటా కారు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

