న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రత్యేక ఎడిషన్‌గా క్రెటా, అల్కాజర్ మాడళ్ళను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది హ్యుందాయ్. ఈ కార్లు రూ.15.17 లక్షల నుంచి రూ.21.23 లక్షల మధ్యలో లభించనున్నాయి. వీటిలో క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ రూ.15.17 లక్షల నుంచి రూ.17.89 లక్షల మధ్యలో, అల్కాజర్ మాడల్ రూ.19.03 లక్షల నుంచి రూ.21.23 లక్షల లోపు ధరను నిర్ణయించింది. అడ్వెంచర్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ మాడళ్లలో పలు నూతన ఫీచర్స్ ప్రవేశపెట్టారు.