Hyderabad | స్టార్టప్ క్యాపిటల్ హైదరాబాద్.. టీ-హబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసింది.
- వివిధ రంగాల్లో 20కిపైగా ఇంక్యుబేటర్లు
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసింది. ఇది.. దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను తెచ్చింది. ఫలితంగా ఇప్పుడు స్టార్టప్‌లకు స్వర్గధామంగా రాష్ట్రం మారింది.
2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 20కిపైగా ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. తెలంగాణలో శరవేగంగా స్టార్టప్ ఎకోసిస్టం మెరుగుపడటానికి ఇక్కడి నైపుణ్యం కలిగిన మానవ వనరులూ కారణమే. స్టార్టప్‌లకు ఫండింగ్ చేసేందుకు ఎంతోమంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతుండటం కూడా కలిసొస్తున్నది. ఐటీ రంగంలో ఎంతో ప్రగతి సాధించినట్టే స్టార్టప్ ఎకోసిస్టం అభివృద్ధిలోనూ తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది.
టీ-హబ్ ప్రగతి ఇలా..
- 2 వేలకుపైగా స్టార్టప్‌లకు ప్రయోజనం
- ఇక్కడి స్టార్టప్‌లకు సమకూరిన రూ.1,860 కోట్ల నిధులు
- 100కుపైగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలు
- 75కుపైగా ప్రముఖ కంపెనీల నుంచి స్టార్టప్‌లకు భాగస్వామ్యం
- టీ-హబ్ ఏర్పాటైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా 1000కిపైగా ఈవెంట్లు
- 600లకుపైగా కార్పొరేట్ కంపెనీలతో కలిసి స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమాలు
- 400లదాకా అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాలు
- టీ-హబ్ కేంద్రంగా 200లకుపైగా మెంటార్లు
- 42 దేశాలు టీ-హబ్‌ను చూసి కొత్తగా ఆవిష్కరణల కోసం కార్యక్రమాలు
- టీ-హబ్‌ను ఇప్పటిదాకా సందర్శించిన 1.50 లక్షల మంది
అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థ
టెక్నాలజీ స్టార్టప్లేగాక విభిన్న రంగాలు, సామాజిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ స్టార్టప్‌లను ప్రోత్సహించే అనుకూల వాతావరణం ఇప్పుడు తెలంగాణ సొంతం. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇలా అన్నిచోట్ల సరికొత్త ఆలోచనలతో వచ్చేవారికి అండగా నిలిచేలా ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి. టీ-హబ్‌తో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఇక్కడ స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.
– టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

