హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు అవార్డు
జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో అవార్డును చేజిక్కించుకున్నది. బ్రిటన్కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడర్ అట్రాక్షన్ టికెట్స్.కామ్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని కుటుంబాలకు అత్యంత అనుకూలమైన విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నాలుగో స్థానం దక్కించుకున్నది.
- ప్రపంచంలోనే నాలుగో ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విమానాశ్రయంగా గుర్తింపు
హైదరాబాద్, జూలై 13 : జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో అవార్డును చేజిక్కించుకున్నది. బ్రిటన్కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడర్ అట్రాక్షన్ టికెట్స్.కామ్ తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోని కుటుంబాలకు అత్యంత అనుకూలమైన విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నాలుగో స్థానం దక్కించుకున్నది. అట్రాక్షన్ టికెట్స్.కామ్ నిర్వహించిన అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా విమానాశ్రయాలను కుటుంబాలకు అనుకూలమైన తొమ్మిది ప్రధాన ప్రమాణాల ఆధారంగా విశ్లేషించింది.
దీంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు 20 మార్కులకు గాను 18.5 మార్కులను సాధించింది. గూగుల్ సమీక్షల రేటింగ్లు, పిల్లల ఆట స్థలాలు, కుటుంబాల కోసం ప్రత్యేక భద్రతా తనిఖీ లైన్లు, శిశు సంరక్షణ సదుపాయాలు, బేబీ స్ట్రోలర్ సేవలు, విశ్రాంతి, వై-ఫై నాణ్యత, విమానాశ్రయ విస్తీర్ణం, ప్రయాణికులకు అందించే సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ సీఈవో కదిర్ కదిరవన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో కుటుంబాలకు అత్యంత అనుకూలమైన విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం గర్వకారణంగా ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

