Hyderabad | ఆఫీస్ మార్కెట్లో హైదరాబాద్ హవా.. సీబీఆర్ఈ తాజా నివేదిక
Hyderabad | దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయ వృద్ధితో పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలోనే 2023-25లో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల మార్కెట్లలోకి కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. భారతీయ ఆఫీస్ రంగానికి దీన్నో శుభసూచకంగా చెప్పవచ్చు.
- దేశంలోని ప్రధాన నగరాల్లో రాబోయే ఆఫీస్ స్పేస్‌లో ఇక్కడే ఎక్కువ
దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయ వృద్ధితో పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలోనే 2023-25లో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల మార్కెట్లలోకి కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. భారతీయ ఆఫీస్ రంగానికి దీన్నో శుభసూచకంగా చెప్పవచ్చు.
-అన్షుమన్ మ్యాగజైన్, సీబీఆర్ఈ ఇండియా చైర్మన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఆఫీస్ మార్కెట్లో ఇకపైనా హైదరాబాద్ హవా కొనసాగనున్నది. కార్యాలయ స్థలాలకు హైదరాబాద్‌లో ఉన్నంత డిమాండ్ దేశంలోని ప్రధాన నగరాల్లో మరెక్కడా కనిపించదన్న అంచనాలున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే ఈ 2023-2025 కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వచ్చే ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్, బెంగళూరు వాటానే 49 శాతంగా ఉండొచ్చని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ అంటున్నది. గురువారం ‘ఆఫీస్ మైథ్స్ డీబంక్డ్’ పేరుతో సీబీఆర్ఈ దక్షిణాసియా విభాగం ఓ కొత్త నివేదికను విడుదల చేసింది. ఆయా రంగాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను అంతర్జాతీయ కార్పొరేట్లు మరిన్ని తీసుకురాబోతున్నారని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లో బెంగళూరు కంటే ఎక్కువగా జీసీసీలు కొలువుదీరబోతున్నాయని ఇటీవలి ఓ నివేదికలో తేలిన సంగతి విదితమే.
165 మిలియన్లకుపైనే..
హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ తీరుతెన్నులపై సీబీఆర్ఈ రిపోర్టు వచ్చింది. ఇందులో 2023-2025లో ఈ ఏడు నగరాల్లో కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రావచ్చని ఉన్నది. 2020-2022లో వచ్చిన ఆఫీస్ స్పేస్ కంటే ఇది అధికం. నాడు 142 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. కాగా, 2020 నుంచి 2022 వరకున్న మూడేండ్ల వ్యవధిలో ఆఫీస్ సైప్లె వార్షిక సగటు 17 శాతం పెరిగిందని, భవన పరిమాణం సగటు సైతం 18 శాతం ఎగిసిందని సీబీఆర్ఈ ఈ సందర్భంగా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ 2023-2025లో ఆఫీస్ సైప్లె, భవన పరిమాణంల వార్షిక సగటు మరో 15-18 శాతం పెరుగవచ్చన్నది.
33 మిలియన్లు..
2023-2025లో రాబోయే 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్‌లోనే 33 మిలియన్ చదరపు అడుగులు రావచ్చని సీబీఆర్ఈ తెలిపింది. మొత్తం అంచనాలో ఇది 20 శాతానికి సమానం. ఢిల్లీ-ఎన్సీఆర్లో 28 మిలియన్ చదరపు అడుగులు (17 శాతం), పుణెలో 19.8 మిలియన్ చదరపు అడుగులు (12 శాతం), చెన్నైలో 18.15 మిలియన్ చదరపు అడుగులు (11 శాతం), ముంబైలో 14.8 మిలియన్ చదరపు అడుగులు (9 శాతం), కోల్‌కతాలో 3.3 మిలియన్ చదరపు అడుగులు (2 శాతం) మేర కొత్తగా కార్యాలయ స్థలాలు రానున్నాయి. అయితే ఈ మూడేండ్లలో బెంగళూరులో అత్యధికంగా 47.8 మిలియన్ చదరపు అడుగుల (29 శాతం) ఆఫీస్ స్పేస్ రాబోతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

