Credit Card | క్రెడిట్ కార్డుతో కొంటున్నారా?.. అయితే పండుగ ఆఫర్లతో ప్రయోజనాలెన్నో
ఈ పండుగ సీజన్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులపై పెద్ద ఎత్తునే ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్‌తోపాటు ఆఫ్‌లైన్ కొనుగోళ్లపైనా భారీగా ఆఫర్లను కల్పిస్తున్నాయి.
Credit Card | ఈ పండుగ సీజన్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డులపై పెద్ద ఎత్తునే ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్‌తోపాటు ఆఫ్‌లైన్ కొనుగోళ్లపైనా భారీగా ఆఫర్లను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే దీపావళి షాపింగ్.. క్రెడిట్ కార్డులపై చేస్తే దండిగా ప్రయోజనాలను పొందవచ్చు. అమెజాన్‌లో షాపింగ్‌తోపాటు బాష్, సామ్సంగ్, డెల్, హైయర్ వస్తూత్పత్తుల ధరలపై ఎస్బీఐ 10 శాతం నుంచి 27.5 శాతం వరకు తగ్గింపులను అందిస్తున్నది. అలాగే ‘హ్యాపీ డైనింగ్’ పేరిట భాగస్వామ్య రెస్టారెంట్లలో బిల్లుపై 15 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం రేగాలియా గోల్డ్, మనీబ్యాక్ప్లస్, మిల్లేనియా క్రెడిట్ కార్డుదారులకు రకరకాల ఆఫర్లను ప్రకటించింది. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా మింత్రా, ఫ్లిప్‌కార్ట్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, బాష్, సీమెన్స్, గోద్రేజ్, ఒప్పో ప్రోడక్ట్స్‌పై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లు, ఇన్స్టంట్ డిస్కౌంట్లను ఇస్తున్నది. యాక్సిస్, ఇండస్ఇండ్, ఆర్బీఎల్, స్టాండర్డ్ చార్టర్డ్ తదితర బ్యాంకులూ ఈ పండుగ పూట కస్టమర్లను ఖుషీ చేస్తున్నా యి. ఇక పండుగలకు ఊర్లకు వెళ్లేవారి కోసం.. క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రో ల్ బంకుల్లో ఇంధనం కొన్నా ఆయా సంస్థలు భారీగా తగ్గింపునిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

