Huawei Nova 11 SE | 3న భారత్ సహా గ్లోబల్ మార్కెట్లోకి హువావే నోవా 11 ఎస్ఈ.. ఇవీ ఫీచర్లు..!
Huawei Nova 11 SE | స్నాప్ డ్రాగన్ 680 ఎల్టీఈ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ ఈ నెల మూడో తేదీన గ్లోబల్, భారత్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారని సమాచారం.
Huawei Nova 11 SE | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం హువావే.. భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలోకి తన హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. స్నాప్ డ్రాగన్ 680 ఎల్టీఈ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్ శుక్రవారం ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. హువావే నోవా 11 ఎస్‌ఈతోపాటు హువావే నోవా, హువావే నోవా 11 ప్రో, హువావే నోవా 11 ఆల్ట్రా ఫోన్లు కూడా ఆవిష్కరిస్తారు. గత ఏప్రిల్‌లో హువావే నోవా11 ఎస్ఈ ఆవిష్కరించింది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని సమాచారం.
హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (1,999 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.25 వేలకు (2,199 చైనా యువాన్లు) లభిస్తుందని వినికిడి.
స్నాప్‌డ్రాగన్ 680 ఎల్టీఈ ఎస్వోసీ విత్ 2.4 గిగా హెర్ట్జ్ సీపీయూతో వస్తున్న హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ హార్మోనీ ఓఎస్ 4 వర్షన్‌పై పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రిజొల్యూషన్‌తోపాటు 6.67- అంగుళాల ఫ్లాట్ ఓలెడ్ ప్యానెల్ డిస్ప్లే కలిగి ఉంటుంది.
హువావే నోవా 11 ఎస్ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 108-ఎంపీ సెన్సర్ మెయిన్ కెమెరా, 8-ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 2-ఎంపీ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-ఎంపీ సెన్సర్ కెమెరా ఉంటాయి. 66 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీ వస్తుంది. బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

