Huawei Mate 60 Pro+ |ఐ-ఫోన్‌కు పోటీగా హువావే మేట్ 60ప్రో?..!
Huawei Mate 60 Pro+ | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే.. శుక్రవారం మార్కెట్లోకి హువావే మేట్ 60 ప్రో + ఆవిష్కరించింది.
Huawei Mate 60 Pro+ | చైనా టెక్ దిగ్గజం హువావే.. మార్కె్ట్లోకి తన హువావే మేట్ 60ప్రో+ (Huawei Mate 60 Pro+) ను ఆవిష్కరించింది. కొన్ని రోజుల క్రితం హువావే మేట్ 60 (Huawei Mate 60) , హువావే మేట్ 60 ప్రో (Huawei Mate 60 Pro) ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. హువావే మేట్ 60 ప్రో + (Huawei Mate 60 Pro+) ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు – బ్లాక్, బీజ్ (ఇంక్ స్టోన్ బ్లాక్, జువాన్ బాయి)ల్లో లభిస్తుంది. చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఈ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి వెల్లడించలేదు. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
హువావే మేట్ 60 ప్రో + (Huawei Mate 60 Pro+) 6.82 -అంగుళాల ఎల్పీటీఓ ఓలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూసన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కున్లన్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. హార్మోనీ ఓఎస్ 4.0 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది.
హువావే మేట్ 60 ప్రో+ (Huawei Mate 60 Pro+) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 48-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 40-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగా పిక్సెల్ ఆల్ట్రా మాక్రో టెలిఫొటో లెన్స్ విత్ ఓఐఎస్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది.
హువావే మేట్ 60 ప్రో (Huawei Mate 60 Pro+) ఫోన్ 88వాట్ల వైర్డ్ లేదా 50 వాట్ల వైర్ లెస్.. 20 వాట్ల వైర్ లెస్ రివర్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూ టూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, 2-శాటిలైట్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. దీని ధర 950 డాలర్లు ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

