Huawei princess Freed | హువావే యువరాణికి విముక్తి.. మూడేళ్లకు జైలు నుంచి విడుదల
Huawei 'princess' Freed | హువావే సీఎఫ్‌వో మెంగ్ వాంగ్జౌకు మూడేండ్ల తర్వాత విముక్తి లభించింది. 2018లో ఆమెను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Huawei ‘princess’ Freed | హువావే చైర్మన్ రెన్ ఝెంఘ్ ముద్దుల తనయ, ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంగ్జౌకు మూడేండ్ల తర్వాత విముక్తి లభించింది. బెయిల్ వచ్చిన వెంటనే విమానంలో బయలుదేరి ఆమె షాంఘైకి చేరుకున్నారు. మూడేండ్ల సుదీర్ఘ జైలు తర్వాత ఆమె చైనాకు రావడం ఇదే తొలిసారి.
2018 డిసెంబర్ ఒకటో తేదీన కెనడా రాజధాని వాంకోవర్‌కు వెళ్లిన మెంగ్ వాంగ్జౌను అమెరికా అధికారుల ఒత్తిడి మేరకు కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.

తర్వాత ఆమెను వాంకోవర్ న్యాయస్థానం హౌస్ అరెస్ట్‌లో ఉంచాలని ఆదేశించింది. అంతటితో ఆగక అమెరికా.. మెంగ్ వాంగ్జౌను తమకు అప్పగించాలని కెనడాపై ఒత్తిడి తెచ్చింది.
దీనికి ప్రతిగా మాజీ కెనడా దౌత్యవేత్త మిచెల్ కోవ్రిగ్, వ్యాపారవేత్త మిచెల్ స్పావోర్లను బంధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. దీంతో చైనా, కెనడా, అమెరికా మధ్య సంప్రదింపులు జరిగాయి.

చివరకు మెంగ్ వాంగ్ఝౌపై మోపిన అభియోగాలను ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. ఆ వెంటనే ఆమెకు వాంకోవర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
చైనా వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులు కోవ్రిగ్, స్పావోర్.. చైనా నుంచి కెనడాకు బయలుదేరారని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడౌ ప్రకటించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రం సేవలందించాలంటే వినిపించే పేరు. అయితే, ట్రంప్ హయాంలో చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం సాగినప్పుడు ఇరాన్‌కు సహాయం చేస్తున్నారన్న ఆరోపణపై మెంగ్ వాంగ్జౌను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలొచ్చాయి. కేవలం రాజకీయ కారణాలతోనే మెంగ్ వాంగ్జౌను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారని చైనా ఆరోపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- canda
- china
- Huawei
- meng wangzou
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

