ఇరకాటంలో ఇంటి బడ్జెట్.. 2 నుంచి 11 శాతం పెరిగిన రేట్లు
ధరలు పెరుగుతున్నాయి. ఇంటి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి.సబ్బులు, సర్ఫ్ పౌడర్ల దగ్గర్నుంచి తలంటుకునే నూనెలు, పొద్దున్నే చకచకా చేసుకుతినే నూడుల్స్దాకా ప్రియమైపోయాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆహార, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల రేట్లను పెంచడంతో గత 2-3 నెలలుగా నెలవారీ షాపింగ్ బిల్లులు మోత మోగిస్తున్నాయి మరి.
- సామాన్యుల నెత్తిన భారం
- ఆయా ఆహారోత్పత్తుల ధరలూ 17 శాతందాకా పైకి
ధరలు పెరుగుతున్నాయి. ఇంటి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి.సబ్బులు, సర్ఫ్ పౌడర్ల దగ్గర్నుంచి తలంటుకునే నూనెలు, పొద్దున్నే చకచకా చేసుకుతినే నూడుల్స్దాకా ప్రియమైపోయాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆహార, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల రేట్లను పెంచడంతో గత 2-3 నెలలుగా నెలవారీ షాపింగ్ బిల్లులు మోత మోగిస్తున్నాయి మరి.
న్యూఢిల్లీ, జూన్ 18: ధరల మంట మొదలైంది. సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతున్నది. సబ్బులు, హెయిర్ ఆయిల్స్, ఆహారోత్పత్తులు అన్నింటి రేట్లనూ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు పెంచుకుంటూపోతున్నాయి మరి. గడిచిన 2-3 నెలల్లో 2 నుంచి 17 శాతం వరకు పెరిగిన ధరలతో బిల్లులు మోత మోగిస్తున్నాయి. గతకొంత కాలంగా మౌనంగా ఉన్న సంస్థలు.. ఇప్పుడు మళ్లీ బాదుడు మొదలుపెట్టాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి ఎన్నికలు ముగిసిన వేళ.. ఎఫ్ఎంసీజీల రేట్ల పెంపు ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిదాయకంగా మారుతున్నది.
ఇదీ సంగతి..
సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2 నుంచి 9 శాతం పెరిగినట్టు తాజా లెక్కలు చూస్తే అర్థమవుతున్నది. హెయిర్ ఆయిల్స్ ధర 8 నుంచి 11 శాతం ఎగబాకగా, వివిధ రకాల ఆహారోత్పత్తుల ధరలు 3 నుంచి 17 శాతం ఎగిసినట్టు తేలింది. నిజానికి 2022, 2023 ప్రథమార్ధం వరకు ధరల్ని పెంచుతూపోయిన ఎఫ్ఎంసీజీ సంస్థలు.. ఆ తర్వాత సైలెంటైపోయాయి. ముఖ్యంగా క్రూడ్, పామాయిల్ ధరలు మార్కెట్లో తగ్గుముఖం పడుతున్న వేళ సబ్బుల ధరలు పెరగడం గమనార్హం. ఇక పాలు, చక్కెర, కాఫీ, కొబ్బరి, బార్లీ వంటి వాటి ధరలు కూడా విజృంభిస్తున్నాయి.
ఇంకా పెరగొచ్చు
ఆయా ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరిగాయని, మున్ముందు ఇంకా పెరుగుతాయని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో.. ఏప్రిల్‌లో హెయిర్ ఆయిల్ ధరలను 6 శాతం పెంచామని, కొబ్బరి రేట్లు పెరుగుతున్నందున మళ్లీ పెరిగేందుకు వీలున్నదని సంకేతాలిచ్చింది. టాటా కన్జ్యూమర్ సైతం ఇదే దారిలో వెళ్తున్నది. డాబర్, ఇమామీ రేట్లు కొంతమేర పెరుగుతాయంటున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. కిలో టమాట సెంచరీ దిశగా పరుగు పెడుతుంటే, ఉల్లి హాఫ్ సెంచరీ కొట్టింది. పచ్చి మిర్చి రూ.80 పలుకుతున్నది. బెండ, దొండ ధరలూ పైపైకిపోతున్నాయి. అన్ని రకాల పప్పుల ధరలూ కిలో రూ.120 నుంచి 180 మేర పలుకుతున్నాయి.
- వివిధ రకాల సబ్బుల ధరల్ని 4-5 శాతం పెంచిన గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. డవ్ సోప్ ధరను 2 శాతం పెంచిన హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్. సంతూర్ సబ్బు ధరను 3 శాతం పెంచిన విప్రో.
- పెరిగిన కాల్గేట్ పామోలివ్ బాడీ వాష్ ధరలు. 4 శాతం పెరిగిన పియర్స్ బాడీ వాష్ రేటు.
- హెచ్‌యూఎల్ డిటర్జంట్ బ్రాండ్లు, పీఅండ్‌జీ హైజిన్-హెల్త్‌కేర్, జ్యోతీ ల్యాబ్స్ ఉత్పత్తుల రేట్లు 1 నుంచి 10 శాతం పుంజుకున్నాయి.
- హెచ్‌యూఎల్‌కు చెందిన షాంపూ ధరలు, స్కిన్ కేర్ ఉత్పత్తుల రేట్లు 4 శాతం వరకు ఎగిశాయి.
- 8-13 శాతం పెరిగిన నెస్లే కాఫీ ధర. మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధర 17 శాతం ఎగిసింది. ఐటీసీ ఆశీర్వాద్ గోధుమ ధరలూ పైకెక్కాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

