Honor Magic 6 Pro 5G | 108 – ఎంపీ పెరిస్కోప్ మెయిన్ కెమెరాతో హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరణ..!
Honor Magic 6 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన ప్రీమియం ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Honor Magic 6 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన ప్రీమియం ఫోన్ హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. హానర్ తీసుకొచ్చిన ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తోపాటు 6.8 అంగుళాల ఎల్టీపీఓ డిస్ ప్లేతో వస్తోంది. 108-మెగా పిక్సెల్ పెరిస్కోప్ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, వైర్డ్ అండ్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ-68 రేటింగ్ కలిగి ఉంటుంది.
హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.89,999లకు లభిస్తుంది. బ్లాక్, ఏపీ గ్రీన్ (Epi Green) కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, ఎక్స్ప్లోర్హానర్ డాట్ కామ్ (Explorehonor.com), ఇతర రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. 12 నెలల వరకూ రూ.7,500 చొప్పున నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో వస్తుంది. వచ్చే 180 రోజుల్లో ధర తగ్గింపు ఉండదని హానర్ తేల్చేసింది.
హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 8.0 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ (1280×2800 పిక్సెల్స్) క్వాడ్ కర్వుడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 4320 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఫ్రీక్వెన్సీ, 5000 నిట్స్ హెచ్డీఆర్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 4ఎన్ఎం క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోంది. 180-మెగా పిక్సెల్స్ 2.5 ఎక్స్ పెరిస్కోప్ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ ఓఐఎస్ సపోర్ట్ అండ్ 100x డిజిటల్ జూమ్, 50-మెగా పిక్సెల్ హెచ్9000 హెచ్డీఆర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ ఆటో ఫోకస్ ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం వైడ్ యాంగిల్ లెన్స్ తో 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వస్తోంది.
హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ (Honor Magic 6 Pro 5G) ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏజీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బైదూ, ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. రేర్ అండ్ సెల్ఫీ కెమెరాలకు, బ్యాటరీ పెర్పార్మెన్స్, డిస్ ప్లే, ఆడియో ఎక్స్‌పీరియెన్స్ కోసం ఫైవ్ డీఎక్స్ఓ మార్క్ గోల్డ్ లేబుల్స్ తీసుకొస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. 80వాట్ల వైర్డ్ చార్జింగ్, 66 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. హానర్ ఈ1 పవర్ ఎన్హాన్స్మెంట్ చిప్ దన్నుతో బ్యాటరీ పని చేస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా బ్యాటరీ పని చేసేలా ఈ1 పవర్ ఎన్హాన్స్మెంట్ చిప్ దోహద పడుతుంది. బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ కావడానికి 40 నిమిషాల టైం పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

