Honor 90 Series | చైనా మార్కెట్లోకి హానర్ 90 సిరీస్ ఫోన్లు.. ఇవీ స్పెషిపికేషన్స్..?!
Honor 90 Series | 200మెగా పిక్సెల్స్ కెపాసిటీ గల హానర్ 90 సిరీస్ ఫోన్లు చైనా మార్కెట్లోకి ఎంటరయ్యాయి.
Honor 90 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. తన హానర్ 90, హానర్ 90 ప్రో ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లు 6.7-అంగుళాల 120 హెర్ట్జ్ ఓలెడ్ డిస్ ప్లే , క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లు కలిగి ఉంటాయి. 200-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా కలిగి ఉంటాయి. రెండు ఫోన్లూ కూడా ఆండ్రాయిడ్-13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.1 వర్షన్ పై పని చేస్తాయి. హానర్ 90 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 66 వాట్ల వైర్డ్ చార్జింగ్ కలిగి ఉంటుంది. హానర్ 90ప్రో కూడా 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉన్నా 90వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉంటది. భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్నది తెలియాల్సి ఉంది.
హానర్ 90 ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ.29,160 (2499 చైనా యవాన్లు) పలుకుతుంది. ఈ ఫోన్ 16 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.32,680 (2799 చైనా యువాన్లు), 16 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.35,017 (2999 చైనా యువాన్లు) పలుకుతుంది.
హానర్ 90 ప్రో ఫోన్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.38,500 (3299 చైనా యువాన్లు), 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.42 వేలు (3599 చైనా యువాన్లు), 16 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.45,500 (3899 చైనా యువాన్లు) పలుకుతుంది.
హానర్ 90 ఫోన్ 6.7-అంగుళాలు, హానర్ 90ప్రో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే (1,200 x 2,664 పిక్సెల్స్) కర్వుడ్ ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 3840 హెర్ట్జ్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ డిమ్మింగ్, హానర్ 90 స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1, హానర్ 90 ప్రో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ సెట్ కలిగి ఉన్నాయి.
హానర్ 90, హానర్ 90 ప్రో పోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. 200-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఎఫ్/ 1.9 అపెర్చర్, 12 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్/2.2 అపెర్చర్ కలిగి ఉంటాయి. హానర్ 90 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, హానర్ 90 ప్రో 32-మెగా పిక్సెల్ టెటిఫొటో పొర్ట్రైట్ లెన్స్ విత్ 2.5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50ఎక్స్ హైబ్రీడ్ జూమ్, ఎఫ్/2.4 అపెర్చర్ ఆప్షన్ కలిగి ఉంటాయి.
రెండు ఫోన్లు 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఎఫ్ /2జ4 అపెర్చర్, హానర్ 90 ప్రో అదనంగా 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్ ఆప్షన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

