Honda’s Elevate |భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లో మిడ్‌సైజ్ ఎస్యూవీ కారును ఆవిష్కరించేందుకు హోండా కార్స్ సిద్ధం అవుతున్నది. జూన్ ఆరో తేదీన న్యూఢిల్లీలో సదరు మిడ్ సైజ్ ఎస్యూవీ `ఎలివేట్ (Elevate)` ను ఆవిష్కరిస్తుంది. భారత్ మార్కెట్లో హోండా కార్స్ ఆవిష్కరిస్తున్న తొలి మిడ్ సైజ్ ఎస్యూవీ కారు ఇది. ఇది హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కార్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.
దాదాపు రెండేండ్ల క్రితమే మిడ్ సైజ్ ఎస్యూవీ కారుకు `ఎలివేట్` అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తున్నది. దీని ధర రూ.12-19 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఆగస్టు నుంచి భారత్ మార్కెట్లో కార్ల డెలివరీ ప్రారంభం కానున్నది. అటుపై గ్లోబల్ మార్కెట్లో విక్రయాలు ప్రారంభం అవుతాయి.
పాపులర్ సెడాన్ ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ ప్లాట్‌ఫామ్‌పై `ఎలివేట్` రూపుదిద్దుకున్నది. గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎస్యూవీ కార్లు సీఆర్-వీ, హెచ్ఆర్-వీల్లో విడి భాగాలు జత చేస్తారని తెలుస్తున్నది. లార్జ్ ఫ్రంట్ గ్రిల్లే, షార్ప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, లాంగ్ బాయ్నెట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు హెచ్ఆర్-వీలో మాదిరిగా టాపర్డ్ రూఫ్‌లైన్, అప్రైట్ స్టాన్స్, 16-అంగుళాల మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
న్యూ జనరేషన్ హోండా సిటీలో మాదిరిగా 1.5 లీటర్ల 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని తెలుస్తున్నది. ఈ ఇంజిన్ 110 బీహెచ్పీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఎస్యూవీ ఎలివేట్‌లో వాడే ఇంజిన్ హయ్యర్ వేరియంట్ ఇంజిన్ వాడతారని సమాచారం. సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఫర్ ది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్లో డ్రైవర్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది.