Honda Shine100cc | హోండా నుంచి చౌక బైక్ షైన్100సీసీ.. ఇక ఆ మూడు బైక్స్‌తో ‘సై’ అంటే ‘సై’!
Honda Shine100cc | దేశీయ మార్కెట్లోకి టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా.. షైన్100 సీసీ బైక్ తీసుకొచ్చింది. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. దీని ప్రారంభ ధర రూ.64,900లకు లభిస్తుంది. మే నెల నుంచి డెలివరీ ప్రారంభించనున్నది.
Honda Shine100cc | ప్రముఖ టూ వీలర్ బైక్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లోకి 100సీసీ సామర్థ్యం గల ఇంజిన్‌తో కూడిన బైక్ ‘షైన్ 100సీసీ (Honda Shine 100cc)’ తీసుకొచ్చింది. ఇతర టూ వీలర్ బైక్స్ ధరలతో పోలిస్తే చౌక ధరకే లభిస్తుంది. ఇప్పటికే మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ హీరో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా వంటి బైక్‌లకు ‘షైన్ 100సీసీ’ గట్టి పోటీ ఇవ్వనున్నది.
హోండా పాపులర్ బైక్ షైన్125సీసీతో పోలిస్తే ‘షైన్ 00సీసీ’ బైక్ స్మాలర్ వర్షన్. దీని ధర రూ.64,900తో ప్రారంభం అవుతుంది. దేశంలోని అన్ని హోండా షోరూమ్‌ల్లో ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వచ్చే మే నుంచి కస్టమర్లకు డెలివరీ ప్రారంభం అవుతుంది. నాలుగు రంగుల్లో యూజర్లకు అందుబాటులోకి వస్తున్నది. రెడ్, బ్లూ, గోల్డ్, గ్రే కలర్స్‌లో కస్టమర్లు తమకు ఇష్టమైన ఆప్షన్ ఎంచుకోవచ్చు. షైన్ 100 సీసీ బైక్ మెరుగైన మైలేజీ ఇస్తుందని హోండా ప్రకటించింది.
ఆల్ న్యూ ఎయిర్‌కూల్డ్, 99.7సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్నది షైన్100 సీసీ బైక్. 4-స్పీడ్ కన్సాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్నది ఈ బైక్. న్యూ-ఫ్యుయల్ ఇంజెక్టెడ్ 100సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా బైక్ స్టార్ట్ చేయడానికి సొలెనాయిడ్ స్టార్టర్ ఫీచర్ కూడా జత చేశారు. ఫ్యూయల్ స్టేషన్ బయట కూడా తేలిగ్గా మరమ్మతు పనులు పూర్తి చేసుకోవచ్చు.
ఆల్ న్యూ షైన్100సీసీ బైక్.. ఈ-20 ఫ్యుయల్తోనూ నడుస్తుంది. హలోజెన్ హెడ్‌లైట్, సైడ్ స్టాండ్ ఇన్హిబిటర్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 1245 వీల్ బేస్, 786ఎంఎం హైట్, 168ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.
హీరో బైక్స్‌తో ‘సై’ అంటే ‘సై’
పాపులర్ హీరో మోటో కార్ప్ బైక్స్‌తో హోండా షైన్ 100సీసీ బైక్ పోటీ పడుతుంది. ఈ సెగ్మెంట్లో హీరో మోటో కార్ప్ నాలుగు బైక్‌లు కలిగి ఉంది. హెచ్ఎఫ్ 100, హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ +, స్ప్లెండర్ +ఎక్స్‌టెక్ వంటి బైక్‌లకు హోండా షైన్ 100 సీసీ బైక్ నుంచి గట్టి పోటీ వస్తుంది. హెచ్ఎఫ్ 100, హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ +, స్ప్లెండర్ +ఎక్స్‌టెక్ బైక్‌ల ధరలు రూ.54,962 – రూ.75,840 మధ్య పలుకుతున్నాయి. మరో బైక్స్ తయారీ సంస్థ బజాజ్ ప్లాటినా 100 మోటార్ సైకిల్ రూ.67,475లకు లభిస్తుంది. కానీ, హోండా షైన్ 100 సీసీ బైక్ ధర రూ.64,900 నుంచి మొదలవుతుంది. దేశీయ బైక్స్ మార్కెట్లో 100సీసీ సెగ్మెంట్లో షైన్100 పట్టు సాధిస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

