Honda SP125 | మార్కెట్లోకి హోండా స్పోర్ట్స్ బైక్ ఎస్ పీ 125.. ధరెంతంటే..?!
Honda SP125 | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. మార్కెట్లోకి స్పోర్టీ బైక్ ఎస్ పీ 125 బైక్ ఆవిష్కరించింది.
Honda SP125 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మంగళవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ ఎడిషన్ హోండా ఎస్పీ 125 (Honda SP 125) మోటార్ సైకిల్ ఆవిష్కరించింది. ఈ-20 పెట్రోల్‌తోనూ నడిచే ఈ బైక్.. ఓబీడీ-2 నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది. పూర్తిగా డిజిటల్ మీటర్‌తో వస్తున్నది. దీని ధర రూ.90.567 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. హోండా ఎస్పీ 125 మోటారు సైకిళ్లు చాలా పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని హోండా రెడ్వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్స్ చేసుకోవచ్చు.
హోండా ఎస్ పీ 125 (Honda SP125) స్పోర్ట్స్ ఎడిషన్ వేరియంట్ వారీగా ధరలు ఇలా
ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ – రూ.85,131 (ఎక్స్ షోరూమ్)
ఫ్రంట్ డిస్క్ బ్రేక్ – రూ.89,131 (ఎక్స్ షోరూమ్)
స్పోర్ట్స్ ఎడిషన్ – రూ.90,567 (ఎక్స్ షోరూమ్)
హోండా ఎస్పీ 125 బైక్ (Honda SP125)పై హోండా మోటార్ సైకిల్ అండ్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 10 ఏండ్ల వారంటీ అందిస్తోంది. మూడేండ్లు స్టాండర్డ్, ఏడేండ్లు ఆప్షనల్ వారంటీ ప్యాకేజీ ఇస్తుంది. భారత్ మార్కెట్లో 125 సీసీ సెగ్మెంట్లో వస్తున్న ఈ మోటార్ సైకిల్.. హీరో గ్లామర్ (Hero Glamour), హీరో సూపర్ స్ప్లెండర్ (Hero Super Splendor), హోండా షైన్ (Honda Shine), టీవీఎస్ రైడర్ (TVS Rider) తదితర బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
హోండా ఎస్పీ 125 (Honda SP125) స్పోర్ట్స్ ఎడిషన్ బైక్.. మ్యాట్టె మఫ్లర్ కవర్స్, బాడీ ప్యానెల్స్ మీద వైబ్రెంట్ స్ట్రైప్స్‌తో న్యూ గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్ వస్తాయి. డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ కలర్ షేడ్స్ తో లభిస్తుంది. ఇంపీరియల్ మెటాలిక్, బ్లాక్, మ్యాట్టె యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ సిరైన్ బ్లూ, మ్యాట్టె మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
123.94సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యుయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తోందీ హోండా ఎస్ పీ 125 బైక్ (Honda SP125). ఈ ఇంజిన్ 10.7 బీహెచ్పీ విద్యుత్, 10.9 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది.
డైమండ్ ఫ్రేమ్ ఆధారంగా వస్తున్న ఎస్ పీ 125 బైక్ (Honda SP125).. టెలిస్కోపిక్ ఫోర్క్ ఫ్రంట్ అండ్ ట్విన్, కంఫర్ట్ రైడింగ్ కోసం ప్రీ లోడెడ్ అడ్జస్టబుల్ రేర్ షాక్ అబ్జార్బర్, స్టార్ట్-స్టాప్ స్విచ్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, పాసింగ్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్ బీమ్ కూడా ఉంటది. స్టెబిలిటీ అండ్ గ్రిప్ లెవల్ మెరుగుదల కోసం 100 ఎంఎం వెడల్పు గల రేర్ టైర్, పీజీఎం-ఎఫ్1 టెక్నాలజీతో తయారు చేశారీ బైక్. ఇతర మోటారు సైకిళ్లతో పోలిస్తే మెరుగైన మైలేజీ ఇస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

