న్యూఢిల్లీ, నవంబర్ 15: ద్విచక్ర వాహన తయారీ అగ్రగామి సంస్థల్లో ఒకటైన హోండా మోటర్‌సైకిల్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్‌గా 125 సీసీ స్కూటర్ గ్రాజియాను పరిచయం చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.87 వేలుగా నిర్ణయించింది. రెప్సోల్ హోండా రేసింగ్ టీంను స్పూర్తిగా తీసుకొని ఈ వాహనాన్ని తీర్చిదిద్వారు. భారత్‌లో రేసింగ్ అభిమానులకోసం ఈ మోడల్‌ను పరిచయం చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ స్కూటర్లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్విచ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ సదుపాయం ఉంది. సైడ్ స్టాండ్ తీయకపోతే ఇంజన్ స్టార్ట్ కాని విధంగా ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దినట్లు ఆ వర్గాలు తెలిపాయి.