Honda Elevate | హోండా ఎలివేట్ కొత్త మైలురాయి.. ఆరు నెలల్లోనూ 30 వేలు దాటిన సేల్స్
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా గత సెప్టెంబర్ లో ఆవిష్కరించిన ఎస్యూవీ కారు ఎలివేట్.. ఆరు నెలల్లోనే 30 వేల యూనిట్లు విక్రయించింది.
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన ఏకైక ఎస్యూవీ కారు ఎలివేట్ (Elevate) కొత్త మైలురాయి నమోదు చేసుకున్నది. గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి 30 వేలకు పైగా యూనిట్లను విక్రయించింది. ఆవిష్కరించిన ఆరు నెలల్లో ఈ మైలురాయిని దాటడం ఆసక్తికర పరిణామం. కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఎంజీ ఆస్టర్, సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ కార్లతో హోండా ఎలివేట్ పోటీ పడుతుంది.
భారత్ మార్కెట్లో 1.5 లీటర్లు, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6600 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 119 బీహెచ్పీ విద్యుత్, 4300 ఆర్పీఎం వద్ద 145 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ 7-స్టెప్స్ ఆప్షన్లతో వచ్చింది. ఎలివేట్ మోడల్ కారు డీజిల్, హైబ్రీడ్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో మార్కెట్లోకి తేవడం లేదని స్పష్టం చేసింది. త్వరలో ఆల్ ఎలక్ట్రిక్ వర్షన్ ఎలివేట్ కారు ఆవిష్కరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
ఎస్వీ, వీ, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్లలో హోండా ఎలివేట్ లభిస్తుంది. ఎస్వీ మినహా అన్ని వేరియంట్ కార్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లోనూ లభిస్తాయి. హోండా ఎలివేట్ కారు ధర రూ.11.58 లక్షల నుంచి రూ.16.20 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.ఇటీవలే భారత్ నుంచి జపాన్‌కు హోండా ఎలివేట్ కారు ఎగుమతి ప్రారంభించింది. జపాన్ లో విక్రయించే ఎలివేట్ కారుకు ‘డబ్ల్యూఆర్-వీ’ అనే పేరు పెట్టింది. హోండా తన కార్లను టర్కీ, మెక్సికో, మద్యప్రాచ్యం, నేపాల్, భూటాన్, సౌతాఫ్రికా దేశాలకూ ఎగుమతి చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

