Honda Cars | పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హోండా కార్స్ ఇండియా (Honda Cars India)’ దేశీయ మార్కెట్లోకి హోండా సిటీ ఎలిగెంట్, హోండా అమేజ్ ఎలైట్ (Honda Amaze Elite) ఎడిషన్ కార్లు ఆవిష్కరించింది. రెండు సెడాన్ కార్లు పరిమితంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అమేజ్ ఎలైట్ ఎడిషన్ కారు రూ.9.04 – 9.86 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్), హోండా సిటీ ఎలిగెంట్ రూ.12.57-13.72 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ప్రారంభం అవుతాయి. రెండు కార్లూ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తాయి.
ఆసక్తి గల కార్ల ప్రేమికులు ఈ నెలాఖరులోగా హోండా కార్స్ ఇండియా వెబ్సైట్, హోండా కార్స్ డీలర్స్ వద్ద బుక్ చేసుకుంటే స్పెషలాఫర్ లభిస్తుంది. సిటీ, అమేజ్, ఇతర కార్లపై ‘ది గ్రేట్ హోండా ఫెస్ట్’ కింద వరకూ ఆఫర్లు అందిస్తోంది.
మారుతి సుజుకి డిజైర్, టాటా టైగోర్, హ్యుండాయ్ ఔరా వంటి మోడల్ కార్లతో హోండా అమేజ్.., మారుతి సుజుకి సియాజ్, హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్ వ్యాగన్ విర్టాస్ వంటి కార్లతో హోండా సిటీ పోటీ పడుతుంది. హోండా సిటీ ‘వీ’ వేరియంట్ మోడల్ ఆధారంగా హోండా సిటీ ఎలిగెంట్ రూపుదిద్దుకున్నది. అమేజ్ వీఎక్స్ వేరియంట్ ఆధారంగా అమేజ్ ఎలైట్ ఎడిషన్ కారు తయారైంది.