న్యూఢిల్లీ, ఆగస్టు 31: వాహన రుణాల కోసం ఇండస్ఇండ్ బ్యాంక్‌తో హోండా కార్స్ జట్టు కట్టింది. ఇందులోభాగంగా హోండా అమేజ్, సిటీ కార్లకు తక్కువ ఈఎంఐ, ఫ్లెక్సీ టర్మ్, 100 శాతం ఎక్స్‌షోరూం ఫండింగ్ లభిస్తుంది. పేర్కొన్న కస్టమర్ గ్రూప్‌ల కోసం ప్రత్యేక పథకాలనూ అందుబాటులో ఉంచినట్లు మంగళవారం ఓ ప్రకటనలో హోండా కార్స్ తెలియజేసింది.