Activa 125 | అప్డేటెడ్ ఫీచర్లతో హోండా యాక్టీవా 125 స్కూటర్.. హెచ్-స్మార్ట్ టెక్నాలజీ స్పెషాలిటీ..!
Activa 125 | హెచ్-స్మార్ట్ టెక్నాలజీతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లోకి అప్ డేటెడ్ యాక్టీవా 125 స్కూటర్ తీసుకొచ్చింది.
Activa 125 | దేశీయ మార్కెట్లోకి హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మంగళవారం తాజా వర్షన్ యాక్టీవా 125 స్కూటర్ ఆవిష్కరించింది. అప్‌గ్రేడెడ్ ఇంజిన్‌తో వస్తున్న యాక్టీవా 125 స్కూటర్ ధర రూ.78,920గా నిర్ణయించారు. హెచ్-స్మార్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనకు అనుగుణంగా అప్డేటెడ్ యాక్టీవా 125 ఆవిష్కరించారు.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అండ్ సీఈవో అతుషి ఒగాటా స్పందిస్తూ ‘ఈ కొత్త మోడల్ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది. తాజా కర్బన ఉద్గారాల నిబంధనలకు అనుగుణంగా కస్టమర్లు హాయిగా ప్రయాణం చేయొచ్చు’ అని వ్యాఖ్యానించారు.
హెచ్-స్మార్ట్ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్ సేఫ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ ఫైండ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. స్మార్ట్ కీ వంటి ఫీచర్లు కూడా జత కలిశాయి. ఈ స్కూటర్ అప్డేటెడ్ డిజిటల్ డిస్ప్లేతో రియల్ టైం మైలేజీ, యావరేజ్ మైలేజీ వంటి అంశాలు తెలిపే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. స్కూటర్‌కి రెండు మీటర్ల దూరం నుంచే ఆటోమేటిక్‌గా లాక్ చేయొచ్చు.
యాక్టీవా 125 స్కూటర్ 125 సీసీ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ స్కూటర్ 8.18 బీహెచ్పీ విద్యుత్, 10.3 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నాలజీ కూడా అందిస్తున్నది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సీబీఎస్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్, ట్యూబ్‌లెస్ టైర్స్ కూడా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

