Home Loan | ఇంటిరుణం కావాలా.. ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లభ్యం!
Home Loans | మీరు ఇంటి రుణం కోసం చూస్తున్నారా.. తొమ్మిది బ్యాంకులు తక్కువ వడ్డీరేట్లకే హోంలోన్లు ఇస్తున్నాయి.
Home Loan | ప్రతి ఒక్కరికి సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఉంటుంది. ఇప్పటికి సొంతిల్లు లేకపోతే కొనుక్కోవాలన్న ఆలోచన వస్తుంది. సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే వారు ఇంటి రుణం తీసుకుంటే అది తేలికవుతుంది. హోంలోన్‌పై ఇల్లు కొనుక్కోవాలని డిసైడయిన వారు ఆ లోన్‌పై వడ్డీరేట్లను పరిశీలిస్తారు. తక్కువ వడ్డీరేటుపై రుణాలిచ్చే బ్యాంకు.. ఈఎంఐ చెల్లింపులు.. తమ ఆదాయ వనరులను బట్టి ఇండ్ల కొనుగోలుదారులు రుణాలు తీసుకుంటారు. తేలిగ్గా.. తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వైపు మొగ్గుతారు. దేశంలోని పది బ్యాంకులు తక్కువ వడ్డీపైనే ఇండ్ల రుణాలిస్తున్నాయి.
తక్కువ వడ్డీరేట్కే రుణాలిచ్చే బ్యాంకుల జాబితా ఇదే
బ్యాంక్ —— —— —- —– —– —– —– ఆర్ఎల్ఎల్ఆర్ — కనీస వడ్డీరేట్ —- —- గరిష్ఠ వడ్డీరేట్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ——– 6.8% —– —– —- 6.6% —– —– —– — 7.35%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ —— ——- —– 6.5% —- —– —- 6.5% —– —– —— — 7.65%
కొటక్ మహీంద్రా బ్యాంక్ —— —— ——- 6.55% —– —– — 6.55% —— ——- —— 7.05%
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ——- ——– ——- 6.5% —— ——– 6.6% ——- ——– —– 8.8%
ఐసీఐసీఐ బ్యాంక్ ——– ———– ——– 6.75% —— ——- 6.7% —— —— ——– 7.4%
కెనరాబ్యాంక్ ———- ———– ———— 6.9% —– ——— 6.65% —— —— —— 8.9%
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర—— —— ——— 6.8% ——- ——– 6.4% —— —— ——– 7.8%
బ్యాంక్ ఆఫ్ ఇండియా —— ———— —- 6.85% ——- —— 6.5% —— —— ——– 8.2%
బ్యాంక్ ఆఫ్ బరోడా —— —— ————- 6.5% —— ———- 6.5% —— ——- ——-7.85%
భారం తగ్గింపు ఇలా
ఏడాది ప్రాతిపదికన గణించడం కంటే నెలవారీగా గణించడం వల్ల రుణ గ్రహీతలకు లాభం చేకూరుతుంది. నెలవారీగా చెల్లింపులు ఖరారు చేసుకుంటే తీసుకున్న రుణంపై నెలవారీ వడ్డీని ఖరారు చేస్తారు. ఏ నెలకానెల వడ్డీ ఖరారు కావడంతోపాటు అసలు మొత్తం తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ ఏడాది ప్రాతిపదిక చెల్లింపులకు అంగీకరిస్తే.. ఏడాది చివరిలో మాత్రమే సర్దుబాటు చేస్తాయి బ్యాంకులు.
టాక్స్ బెనిఫిట్స్ ఇలా
- ఇంటి రుణం గ్రహీతలు ఆదాయం పన్ను చట్టం-1961 ద్వారా అసలు, వడ్డీ చెల్లింపులపై పన్ను రాయితీ పొందొచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతిఏటా రూ.1.50 లక్షల వరకు వడ్డీ చెల్లింపుపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
- అదనంగా రూ. లక్ష వరకు ఐటీ చట్టంలోని 80సీ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు తీసుకోవచ్చు.
- పలు బ్యాంకులు తమ రుణ గ్రహీతలు ముందస్తుగా, భారీ మొత్తం చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తాయి. అయితే భారీ లేదా ముందస్తు చెల్లింపులు మినహా రుణంపై రెండు శాతం రీపేమెంట్ పెనాల్టీ వసూలు చేస్తాయి.
- అత్యధిక బ్యాంకుల్లో ప్రతి నెలా లేదా నిరంతరం ఈఎంఐ (నెలసరి వాయిదా) కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించిన వారిపై బ్యాంకులు ప్రీ-పేమెంట్ పెనాల్టీ విధిస్తాయి.
- కనుక ప్రతి ఒక్కరూ ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్రీ-పేమెంట్ షరతులను పూర్తిగా తెలుసుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

