HMSI Bikes Recall | ఆ మోటారు సైకిళ్లు రీకాల్.. హోండా మోటార్ సైకిల్స్ వెల్లడి.. ఎందుకంటే..?!
HMSI Bikes Recall | ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా కొన్ని మోడల్ టూ వీలర్స్ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
HMSI Bikes Recall | ప్రముఖ టూ వీలర్స్ సంస్థ హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (Honda Motor Cycle and Scooters India-HMSI) కొన్ని మోడల్ టూ వీలర్స్ రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 350సీసీ సెగ్మెంట్లో మార్కెట్లోకి తెచ్చిన హెచ్ఎన్ఈఎస్ఎస్ సీబీ 350, సీబీ350ఆర్ఎస్ మోడల్ మోటారు సైకిళ్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. ఒక విడి భాగంలో లోపం సరి చేసి ఇవ్వడానికే ఈ రీకాల్ చేపట్టామన్నది. కానీ ఎన్ని మోటారు సైకిళ్లు రీకాల్ చేస్తున్న సంగతి తెలుపలేదు.
స్టాఫ్ లైట్ స్విచ్‌లో రబ్బర్ పార్ట్ తయారీలో లోపం ఉన్నట్లు హోండా మోటారు సైకిల్స్ పేర్కొంది. దీనివల్ల రబ్బర్‌లో క్రాక్ వచ్చే అవకాశం ఉందని, దీంతో స్విచ్ లోపలికి నీరు చేరు చాన్స్ ఉన్నదని తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య తయారైన బైక్స్‌లో ఈ లోపం తలెత్తినట్లు హోండా వివరించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ మోటారు సైకిళ్లు రీకాల్ చేస్తున్నామని తెలిపింది.
హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ బిగ్ వింగ్ డీలర్ల వద్ద ఈ నెల రెండో వారం నుంచి ఈ పార్ట్ మార్పిడి జరుగుతుందని పేర్కొంది. వాహనాల యజమానులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదని తెలిపింది. వారంటీ ఉన్నా, లేకున్నా ఉచితంగా పార్ట్ రీప్లేస్ చేస్తామని స్పష్టం చేసింది. సీబీ350 డీఎల్ఎక్స్ వేరియంట్ మోటారు సైకిల్ రూ.1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), డీఎల్ఎక్స్ ప్రో వేరియంట్ ధర రూ.2.17 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

