తగ్గిన సబ్బుల ధరలు
వరుసగా రెండేండ్లుగా ధరలు పెంచుతూ వినియోగదారులపై భారం మోపిన ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనీలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుతం శుభవార్తను అందించింది.
- 19 శాతం వరకు తగ్గించిన హిందుస్థాన్ యూనీలీవర్
- పామాయిల్ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్లనే
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వరుసగా రెండేండ్లుగా ధరలు పెంచుతూ వినియోగదారులపై భారం మోపిన ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనీలీవర్(హెచ్‌యూఎల్) ప్రస్తుతం శుభవార్తను అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తులు, ముడి సరుకులు, పామాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా సబ్బులు, డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను 2 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడంతో గడిచిన రెండేండ్లుగా ఆయా ఉత్పత్తుల ధరలను 20 శాతం వరకు పెంచాయి సంస్థలు. కరోనా సమయంలో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంస్థలు..మళ్లీ రికార్డు స్థాయికి చేరుకోవడంతో క్రమంగా ఒక్కో సంస్థ తమ ఉత్పత్తుల ధరలను భారీగా పెంచాయి. జూన్ త్రైమాసికం నుంచి ముడి సరుకుల ధరలు దిగొస్తుండటంతో ఈ ప్రయోజనాన్ని సంస్థలు కస్టమర్లకు బదలాయిస్తున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలు 8 శాతం నుంచి 15 శాతం వరకు దిగొచ్చాయి. దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో అగ్రగామి సంస్థయైన హెచ్‌యూఎల్..లైఫ్‌బాయ్ ధరను 5 శాతం, డోవ్ సబ్బు ధరను రూ.27 నుంచి రూ.22కి తగ్గించింది. దీంతోపాటు వీల్ గ్రీన్ బార్, లక్స్ సోప్స్, ఇతర ఉత్పత్తుల ధరలను తగ్గించింది.
భవిష్యత్తులో పెరిగే అవకాశం
ప్రస్తుతం ధరలు తగ్గించిన ఎఫ్ఎంసీజీ రంగ సంస్థలు మళ్ళీ ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పతనమవడం ఇందుకు కారణమని తెలుస్తున్నది. మరోవైపు, ధరలు భారీగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో వాడకాన్ని భారీగా తగ్గించారు. దీంతో గడిచిన త్రైమాసికంలో అమ్మకాలు అంతం త మాత్రంగానే నమోదయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన ఉత్పత్తుల ధరలను ఇప్పటికే తగ్గించింది. గోద్రేజ్ నం.1 సబ్బు ధరను రూ.10 కోత విధించిన విషయం తెలిసిందే.
‘ముడి సరుకుల ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ధరలు పెంచిన ఎఫ్ఎంసీజీ రంగ సంస్థలు ప్రస్తుతం ధరలు తగ్గించే పనిలో పడ్డాయి. గడిచిన ఆరు నెలలుగా పామాయిల్ ధరలు 40 శాతం వరకు తగ్గడం ఇందుకు కారణం.
– సచిన్ బొబాదే, డొలట్ క్యాపిటల్ వైస్ ప్రెసిడెంట్
తగ్గిన ఉత్పత్తుల ధరలు
రిన్ డిటర్జెంట్ పౌడర్: కిలో ప్యాక్ ధర రూ.103 నుంచి రూ.99కి
సర్ఫ్ ఎక్సేల్ లిక్విడ్: అర లీటర్ ప్యాక్ ధర రూ.115 నుంచి రూ.112కి
లైఫ్‌బాయ్ సబ్బులు: 125 గ్రాములు కలిగిన నాలుగు ప్యాక్ ధర రూ.140 నుంచి రూ.132కి
లక్స్ సబ్బులు: 100 గ్రాములు కలిగిన నాలుగు ప్యాక్ ధర రూ.156 నుంచి రూ.140కి
డోవ్: 50 గ్రాముల సబ్బు ధర రూ.27 నుంచి రూ.22కి
వీల్ గ్రీన్ బార్: 80 గ్రాముల ఎస్కేయూ ధర రూ.7 నుంచి రూ.5కి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

