Hinduja Group | కష్టాల్లో హిందుజా ఫ్యామిలీ.. బాబాయిలపైనే శ్రీచంద్ తనయ లీగల్ ఫైట్!
Hinduja Group | శ్రీచంద్ హిందుజా మనుమడు కరం .. స్విస్ బ్యాంక్ ఓనరయ్యారు. అది తనదే అంటున్నారు శ్రీచంద్ తనయ.

Hinduja Group | భారత సంతతికి చెందిన ప్రవాస భారతీయ వ్యాపారవేత్తల కుటుంబం హిందుజాలు ఇబ్బందుల్లో ఉన్నారా.. అవుననే సమాధానమే వస్తుంది. బ్రిటిష్ ఇండియన్ హిందూజాగ్రూప్ కురువృద్ధుడు శ్రీచంద్ హిందుజా 31 ఏండ్ల మనుమడు కరం హిందూజా.. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన స్విస్ బ్యాంక్ యజమాని కావాలని కలలు కన్నాడు. అందుకనుగుణంగా గతేడాది ఓ స్విస్ ప్రైవేట్ బ్యాంక్ సారధ్య బాధ్యతలు స్వీకరించారు. తన తాత శ్రీచంద్ విలువలను సాకారం దిశగా అడుగులేస్తున్న కరం హిందూజా ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా తన బ్యాంకును మరింత ఆధునీకరించాలని తలపెట్టారట. బ్యాంక్ క్లయింట్లతో మరింత పారదర్శకంగా లావాదేవీలు జరుపాలని సిబ్బందికి సూచించారట.
గమ్మత్తేమిటంటే హిందూజాల ఫ్యామిలీ ఇబ్బందుల్లో చిక్కుకున్న వేళ.. కరం హిందూజా.. సదరు బ్యాంకు సారధ్య బాధ్యతలు స్వీకరించారు. 85 ఏండ్ల శ్రీచంద్ కుటుంబం.. శ్రీచంద్ ముగ్గురు సోదరుల మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతున్నది. శ్రీచంద్ హిందూజా తరఫున ఆయన తనయ వినూ తన బాబాయిలపైనే న్యాయ పోరాటానికి దిగారు. ఆమె సదరు బ్యాంకు మొత్తం యాజమాన్యం తనదేనని వాదిస్తున్నారు. శ్రీచంద్ సోదరులు మాత్రం ఈ బ్యాంక్ హిందూజా గ్రూపులో ఒక భాగం అని అంటున్నారు.
గతేడాది ప్రారంభంలో కరం హిందూజా ఈ బ్యాంకు సారధ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండేండ్లలోనే క్లయింట్ల ఆస్తుల వివరాలు 30 శాతానికి పైగా పడిపోయాయని తెలుస్తోంది. అంటే 1.69 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (1.82 బిలియన్ డాలర్ల)కు పడిపోయాయట. ఇది క్లయింట్స్ తమ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నందుకు కాదట. కానీ, గత నెలాఖరు నాటికి మొత్తం బ్యాంకు యాజమాన్యం అంచనా ప్రకారం 2.43 బిలియన్ల స్విస్ ఫ్రాంకోస్కు పెరిగాయని తెలుస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కరం హిందూజా.. బ్యాంకుకు ఎస్పీ హిందుజా బ్యాంకు ప్రీవీ అని పేరు పెట్టారు. కానీ హిందూజా గ్రూప్ వెబ్సైట్లో మాత్రం హిందూజా బ్యాంక్ స్విట్జర్లాండ్ అని ఉండటం గమనార్హం. కుటుంబ వివాదాలతో పని లేకుండా బ్యాంకు ఫ్యూచర్‌పైనే ఫోకస్ చేశానని కరం హిందూజా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, మనీ లాండరింగ్ నిబంధనల అమలులో విఫలం కావడంతో గతేడాది మేలో హిందూజా స్విట్జర్లాండ్ బ్యాంక్.. క్యేమాన్ ఐలాండ్ బ్యాంకింగ్ లైసెన్సు వదులుకున్నది. ఇదిలా ఉంటే తన తాత శ్రీచంద్ మాదిరిగానే ఆయన న్యూయార్క్‌లో స్థాపించిన డిజిటల్ మీడియా టైంలెస్ మీడియాకు చెందిన నలుగురు నిపుణులకు బ్యాంకుకు తీసుకొచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

