Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Hindenburg - SEBI | అదానీ గ్రూపు అవకతవకలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ తన నివేదిక బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే తన క్లయింట్ తో షేర్ చేసుకుందని సెబీ ఆరోపించింది.
Hindenburg – SEBI | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతున్నదని 2023 ప్రారంభంలో ఆరోపించిన యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ మీద దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూపు అవకతవకలపై నివేదిక రూపొందించిన హిండెన్ బర్గ్.. ఆ నివేదికను ముందే తన క్లయింట్లతో షేర్ చేసుకున్నదని, సెబీ ఆరోపించింది. గతేడాది నివేదిక వెల్లడయ్యాక ఆయా క్లయింట్ల షార్ట్ పొజిషన్ల ద్వారా సంపాదించిన లాభాల్లో హిండెన్ బర్గ్ వాటా పొందిందని తెలిపింది.
2022 చివర్లోనే హిండెన్ బర్గ్ సంస్థ యాజమాన్యానికి కింగ్డన్ అనే యూఎస్ హెడ్జ్ ఫండ్ మేనేజర్‌తో అనుబంధం మొదలైందని సెబీ ఆరోపణ. అదానీ గ్రూప్ అవకతవకలపై హిండెన్ బర్గ్ తన నివేదికను బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే కింగ్డన్తో షేర్ చేసుకుందని ‘సెబీ’ తెలిపింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కోరుతూ హిండెన్ బర్గ్ యాజమాన్యానికి తన 46 పేజీల షోకాజ్ నోటీసు ఇచ్చింది. హిండెన్ బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని అదానీ గ్రూప్ కంపెనీల్లో కింగ్డన్ షార్ట్ పోజిషన్లు తీసుకున్నదని తెలిపింది. నివేదిక బహిర్గతం కాగానే అదానీ గ్రూప్ సంస్థల్లో తన పొజిషన్లను.. అంటే తాను కొనుగోలు చేసిన వాటాలను విక్రయించడం ద్వారా కింగ్డన్ లాభాలు గడించిందని, ఈ లాభంలో 30 శాతం హిండెన్ బర్గ్‌కు చెల్లించేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని వివరించింది. కానీ, హిండెన్‌బర్గ్‌కు లాభాలను బదిలీ చేయడంలో జాప్యం వల్ల తర్వాత 25 శాతానికి కింగ్డన్ తగ్గించిందని సెబీ ఆరోపించింది.
సదరు కింగ్డన్ హెడ్జ్ ఫండ్ సంస్థకు, కొటక్ మహీంద్రా బ్యాంకుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 150 బిలియన్ డాలర్ల మేరకు హరించుకుపోయింది. అదానీ గ్రూప్ మీద ఆరోపణలు అనుచితం అని సెబీ తెలిపింది. ఒక సంస్థతో కుమ్మక్కై అనుచిత లాభాలు పొందడం సరి కాదని, నాన్ పబ్లిక్, తప్పుడు సమాచారన్ని ప్రజల్లోకి, ఇన్వెస్టర్లలోకి తీసుకెళ్లి ఆందోళనకు గురిచేసిందని సెబీ ఆరోపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

