Harley Davidson X440 | న్యూఢిల్లీ, జూలై 5: భారత్‌లో హార్లీ డేవిడ్సన్ X440 బైక్స్ ఉత్పత్తి, మార్కెటింగ్ చేస్తున్న హీరో మోటోకార్ప్ ఆ మోటార్‌సైకిళ్ల బుకింగ్స్ ప్రారంభించినట్టు ప్రకటించింది. రూ.5,000 చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. హార్లీ డేవిడ్సన్స్ డీలర్‌షిప్‌ల వద్ద, ఎంపికచేసిన హీరో అవుట్లెట్స్లోనూ రిజర్వ్ చేసుకోవచ్చు.
డెనిమ్, వివిడ్, ఎస్ పేర్లతో 3 వేరియంట్స్‌లో లభ్యమ య్యే ఈ బైక్స్ ప్రారంభ ధర రూ.2.29 లక్షలు, రూ.2.49 లక్షలు, రూ.2.69 లక్షలు. డెలివరీలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి.