డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. అధిక వడ్డీరేట్లతో పరిమితకాలానికిగాను ఈ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
- ప్రత్యేక స్కీంను విడుదల చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ, మే 29: డిపాజిట్లను ఆకట్టుకోవడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టింది. అధిక వడ్డీరేట్లతో పరిమితకాలానికిగాను ఈ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. 35 నెలల స్పెషల్ ఎఫ్డీ స్కీంపై సాధారణ పౌరులకు 7.2 శాతం, 55 నెలల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీలపై 7.25 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నది. అలాగే ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేట్లను సైతం సవరించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
ఈ డిపాజిట్ల పథకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం బ్యాంక్ 7 రోజుల నుంచి 29 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 3 శాతం, 30-45 రోజుల ఎఫ్డీలపై 3.50 శాతం, 46 రోజులు-ఆరు నెలలపై 4.50 శాతం ఆఫర్ చేస్తున్నది. అలాగే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలోలపు డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..అలాగే తొమ్మిది నెలల నుంచి ఏడాది లోపు ఎఫ్డీలపై 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఏడాది నుంచి 15 నెలల లోపు ఎఫ్డీలపై 6.60 శాతం, 15 నెలల నుంచి 18 నెలలోపు ఎఫ్డీలపై 7.10 శాతం వడ్డీని చెల్లించనున్నది బ్యాంక్. 18 నెలల నుంచి 2 ఏండ్లలోపు డిపాజిట్లపై 7 శాతం వడ్డీని చెల్లించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

