రిటర్న్ వేయకపోతే

- జీఎస్టీఆర్-1 దాఖలుకు నిరాకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: వ్యాపారస్తులు నెలవారీ జీఎస్టీ చెల్లింపు జరపకుండా, జీఎస్టీ రిటర్న్ వేయకపోతే, ఆ మరుసటి నెల జీఎస్టీఆర్-1 సేల్స్ రిటర్న్ దాఖలును నిరాకరిస్తారు. ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సెంట్రల్ జీఎస్టీ రూల్ 59(6)ని సవరించాలని శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. సవరించిన నిబంధన ప్రకారం జీఎస్టీఆర్-3బీ ఫారమ్ ద్వారా రిటర్న్ వేయకపోతే, ఆ తర్వాతి నెలలో జీఎస్టీఆర్-1 ఫారమ్ దాఖలు చేయడాన్ని అనుమతించరు. వ్యాపారస్తులు నెలకు చెల్లించాల్సిన మొత్తాన్ని జీఎస్టీఆర్-3బీ ఫారమ్‌లో తెలియపర్చి, ఆ మొత్తాన్ని గడువులోగా చెల్లించాల్సిఉంటుంది. నెలలో జరిగిన అమ్మకాల వివరాల్ని తెలియపర్చేందుకు జీఎస్టీఆర్-1 ఫారమ్‌ను దాఖలు చేస్తారు. నెలలో జరిగిన అమ్మకాల వివరాల్ని, ఆ తదుపరి నెలలో 11వ తేదీలోగా జీఎస్టీఆర్-1 రిటర్న్ ద్వారా తెలియపరుస్తారు. ఆ తర్వాతి నెలలో 20-24 తేదీల మధ్య జీఎస్టీఆర్-3బీని వేసి, జీఎస్టీని చెల్లిస్తారు.
ఆధార్ తప్పనిసరి..
జీఎస్టీ రిఫండ్స్ క్లయిం చేయడానికి, క్యాన్సిల్ చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను పునరుద్దరించడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ ధృవీకరణను కౌన్సిల్ తప్పనిసరి చేసింది. 2020 ఆగస్టు 21న కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ ధృవీకరణను వ్యాపారులివ్వకపోతే, వ్యాపారం జరిగే ప్రాంతాన్ని భౌతికంగాచూసి, నిర్దారించుకున్న తర్వాత రిజిష్టర్ చేస్తున్నారు. కాగా ఇప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తో ఆధార్‌ను తప్పనిసరిగా లింక్ చేసే నిబంధనను కౌన్సిల్ ఆమోదించింది. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తో లింక్ అయిఉన్న ప్యాన్ నంబరు కలిగిన బ్యాంక్ ఖాతాలోనే జీఎస్టీ రిఫండ్స్ వేయాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

