Tech layoffs | గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం : 600 మంది ఉద్యోగులపై గ్రాండ్ థెఫ్ట్ ఆటోమేకర్ వేటు
Tech layoffs | వీడియో గేమింగ్ కంపెనీ, గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఫ్రాంఛైజీ మేకర్ టేక్ -టూ ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్ లేఆఫ్స్ ప్రకటించింది.
Tech layoffs | వీడియో గేమింగ్ కంపెనీ, గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఫ్రాంఛైజీ మేకర్ టేక్ -టూ ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్ లేఆఫ్స్ ప్రకటించింది. వ్యయ నియంత్రణ, కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా భారీ పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికను వెల్లడించింది. ఈ ప్రణాళికలలో భాగంగా కంపెనీ ఉద్యోగుల్లో 5 శాతం అంటే దాదాపు 600 మంది ఉద్యోగులను సాగనంపుతోంది. కంపెనీ అభివృద్ధి చేస్తున్న పలు ప్రాజెక్టులను నిలిపివేసింది.
ఈ చర్యలతో కంపెనీకి ఏటా 165 మిలియన్ డాలర్లు ఆదా కానున్నాయి. టేక్ టూ ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్‌లో మార్చి 31, 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 11,580 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టేక్-టూ 2023 మార్చిలోనూ పలువురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
తన ప్రైవేట్ డివిజన్ పబ్లిషింగ్ లేబుల్ సహా ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. ఇక టేక్ టూతో పాటు ఈ ఏడాది టెన్సెంట్కు చెందిన రియోట్ గేమ్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, సోనీ సహా పలు గేమింగ్ దిగ్గజాలు లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. గేమింగ్ పరిశ్రమ ఆదాయ వృద్ధి మహమ్మారికి ముందున్న స్ధాయిల కంటే దిగువన ఉండటంతో గేమింగ్ కంపెనీలను ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి.
Read More :
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

