మేడిన్ ఇండియా: మనకో యాప్ స్టోర్..‘మొబైల్ సేవా యాప్ స్టోర్’

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల యూజర్ల కోసం కేంద్ర ప్రభుత్వం సొంత యాప్ స్టోర్స్ డెవలప్‌చేసింది. ‘మొబైల్ సేవా యాప్ స్టోర్’ పేరిట దేశీయ తొలి యాప్ స్టోర్ నెటిజన్లకు అందుబాటులోకి వచ్చింది. సొంతంగా మొబైల్ యాప్ డెవలప్‌చేసి, బలోపేతం చేయడంతోపాటు యాప్‌లను డెవలప్చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తున్నది. ఈ సంగతి కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో గురువారం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివిధ పబ్లిక్ సర్వీసెస్ కేటగిరీల్లో వివిధ డొమైన్లలో 965 పై చిలుకు యాప్స్ ‘మొబైల్ సేవా యాప్ స్టోర్’లో సేవలందిస్తున్నాయన్నారు.

దేశానికి సొంతంగా డిజిటల్ అప్లికేషన్ స్టోర్ లేకపోవడంతో గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఆపిల్లతో డిజిటల్ సేవలను ఉపయోగించుకుంటన్నామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కానీ గూగుల్, ఆపిల్ డిజిటల్ ఎకో సిస్టమ్ సమస్యలు స్రుష్టిస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో స్వావలంభన కోసం ప్రభుత్వ, ప్రైవేట్ యాప్‌ల కోసం సింగిల్ లేదా సెపరేట్ డిజిటల్ స్టోర్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చిందన్నారు. ఆండ్రాయిడ్‌పై సుమారు ఐదు శాతం యాప్స్ ఇండియన్ యాప్స్ డెవలపర్స్ తయారు చేసినవేనని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రారంభదశలో ఉచితంగానే ఇండియన్ యాప్ స్టోర్ ఫర్ హోస్టింగ్ యాప్స్ అందుబాటులో ఉంటుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

