Google FunSearch | సంక్లిష్ట గణిత సమస్యలను పరిష్కరించే ఏఐ మోడల్ : ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్ పరిశోధకులు
సంక్లిష్ట గణిత సమస్యలను ఇట్టే చక్కదిద్దే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ ఫన్సెర్చ్ను (Google FunSearch) గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు క్రియేట్ చేశారు.
న్యూఢిల్లీ : సంక్లిష్ట గణిత సమస్యలను ఇట్టే చక్కదిద్దే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ ఫన్సెర్చ్ను (Google FunSearch) గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు క్రియేట్ చేశారు. క్లిష్టమైన గణిత సమస్యలను గూగుల్ ఫన్సెర్చ్ ఏఐ మోడల్ సులభంగా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ పరిష్కరించలేనివిగా భావించిన క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కోసం మొదటిసారిగా విస్తృత భాష నమూనా (LLM)ని ఉపయోగించడానికి ఈ ఆవిష్కరణ బాటలు వేస్తుందని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన పత్రం పేర్కొంది.
ఎల్ఎల్ఎంలు కేవలం ఊహాత్మక కంటెంట్‌ను జనరేట్ చేస్తాయనే సంప్రదాయ ఉద్దేశాలను చెరిపేస్తూ సరైన దిశలో మార్గనిర్దేశం చేసి, సరైన దృక్పదంతో ముందుకెళితే ఎల్ఎల్ఎంలు ఆవిష్కరణలకూ తెరతీస్తాయని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రాథమిక గణితం, కంప్యూటర్ సైన్స్‌లో డీప్‌మైండ్ సాధించిన విజయాల పరంపరను ఫన్సెర్చ్ కొనసాగిస్తుంది.
గణితంలో సంక్లిష్ట సమస్యలను ఫన్సెర్చ్ పరిష్కరించే క్రమంలో గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చ్ వైస్ ప్రెసిఎంట్ పుష్మీత్ కోహ్లీ సారధ్యంలోని పరిశోధక బృందం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడాలజీని ఎంచుకుంది. క్లిష్టమైన సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడానికి ఏఐ సామర్థ్యాలను ఉపయోగించడంలో ఫన్సెర్చ్ విజయం ఓ కీలక ముందడుగా చెబుతున్నారు.
Read More :
Brazilian Singer | లైవ్ ప్రదర్శన ఇస్తూ.. స్టేజ్‌పై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ సింగర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

