Google Pay cuts | పర్మినెంట్‌గా వర్క్ ఫ్రం హోం అంటే అంతే !
Google Pay cuts | కరోనాకు ముందు గూగుల్‌కు సంబంధించిన ఓకే ఆఫీసులో పని చేసిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకున్న....

కరోనాకు ముందు గూగుల్‌కు సంబంధించిన ఓకే ఆఫీసులో పని చేసిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. కోవిడ్-19 నియంత్రణ కోసం గ్లోబల్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నది గూగుల్. సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారి వేతనాల్లోనూ కోత విధించడం గమనార్హం.
టెక్ దిగ్గజాలూ వేతనాల తగ్గింపు
సిలికాన్ వ్యాలీలోని టెక్ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, ట్విట్టర్ కూడా ఇంటి వద్ద నుంచి పని చేసే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. రెడ్డిట్, జిల్లో వంటి సంస్థలు కూడా అదే బాట పట్టాయి.
వర్క్ ఫ్రం హోంకు పరిమితమైతే 25 % కోత
సియాటెల్, బోస్టన్, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లోని ఉద్యోగుల వేతనాల్లో 5-10 శాతం కోత విధించారు. శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయానికి దూరమై వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న వారికి 25 శాతం వేతనాలు తగ్గుతున్నాయని గూగుల్ ఉద్యోగులు సంకేతాలిచ్చారు.
ప్రాంతాల వారీ తేడాలు ఇలా
దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి స్పందిస్తూ లొకేషన్‌ను బట్టి పరిహారం ప్యాకేజీలు ఉంటాయి. ఇది సిటీ నుంచి సిటీకి, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. పేరు చెప్పడానికి ఇష్ట పడని గూగుల్ ఉద్యోగి స్పందిస్తూ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్న ఉద్యోగుల వేతనాలు 10 శాతం తగ్గించారన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Pay cut
- Work From Home
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

