Sundar Pichai : టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దినచర్య వార్తాపత్రికలను తిరగేయడం, సోషల్ మీడియాను చెక్ చేయడంతో ప్రారంభం కావడానికి బదులు వినూత్న రీతిలో సాగుతుంది. ఆయన ప్రతి ఉదయం నిద్ర లేవగానే టెక్‌మీమ్ అనే వెబ్సైట్లో లేటెస్ట్ టెక్ న్యూస్ చదవడంతో సుందర్ పిచాయ్ రోజు ప్రారంభమవుతుంది.
2005లో గేబ్ రివెర స్ధాపించిన టెక్మీమ్లో బ్లూమ్‌బర్గ్, సీఎన్‌బీసీ, వెర్జ్ వంటి టెక్ సోర్స్‌ల నుంచి సేకరించిన హెడ్‌లైన్స్ ఆకట్టుకుంటాయి. పాపప్స్, యాడ్స్ వంటి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ టెక్ వెబ్సైట్ సాంకేతిక ప్రపంచంలో చోటుచేసుకున్న కీలక అంశాలతో కూడిన క్విక్ సమ్మరీని ఆఫర్ చేస్తుంది.
సుందర్ పిచాయ్ కాకుండా టెక్‌మీమ్ సైట్‌ను మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీటీవో అండ్ఊ బాస్వర్త్, ఇన్స్టాగ్రాం హెడ్ ఆడం మొసేరి వంటి అత్యున్నత ఎగ్జిక్యూటివ్‌లు ట్రాక్ చేస్తుంటారు. ఇక మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ట్విట్టర్ సీఈవో డిక్ కాస్టొలో కూడా ఈ టాప్ టెక్ సైట్‌ను తరచూ చూస్తుంటారు.
Read More :
TCS | ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందే : ఉద్యోగులకు టీసీఎస్ ఫైనల్ వార్నింగ్