Elan Musk | ట్వీట్స్ సంఖ్యను పెంచాలన్న యూజర్.. మంచి ఆలోచన అంటూ ఎలన్ మస్క్ సమాధానం
ట్విట్టర్లో 280 అక్షరాల లోపున్న ట్వీట్స్ మాత్రమే పోస్ట్ చేయడానికి వీలుంది
Elan Musk : ట్విట్టర్లో వచ్చే శుక్రవారం నుంచి మూడు రంగుల వెరిఫికేషన్ టిక్‌లను తీసుకొస్తున్నామని ఎలన్ మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈమధ్యే పోలింగ్ ద్వారా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించాడు. ఈ నేపథ్యంలో ట్వీట్ సంఖ్యను పెంచాలని ఒక యూజర్ మస్క్‌కు సలహా ఇచ్చాడు. ట్వీట్స్ సంఖ్యను 420 వరకు పెంచాలని అతను కోరాడు. అందుకు మస్క్ ‘నిజంగా మంచి ఆలోచన’ అంటూ సమాధానం ఇచ్చాడు. దాంతో, ట్వీట్స్ సంఖ్యను పెంచడంపై మస్క్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. ఇక యూజర్లకు పండగే.
ప్రస్తుతం ట్విట్టర్లో 280 అక్షరాల లోపున్న ట్వీట్స్ మాత్రమే పోస్ట్ చేయడానికి వీలుంది. మొదట్లో 140 క్యారెక్టర్స్ మాత్రమే ఉండేవి. అయితే యూజర్ల కోరిక మేరకు ట్విట్టర్ 2017 సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను రెండింతలు చేసింది. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు బ్లూ టిక్ వెరిఫికేషన్ వంటి నిర్ణయాలతో మస్క్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

