గోల్డ్ రష్
మార్కెట్లో ధన్తేరాస్ (ధనత్రయోదశి) సందడి కనిపించింది. శుక్రవారం బంగారం, వెండికి భారీ డిమాండ్ నమోదైనట్టు నగల వ్యాపారులు తెలిపారు. ఇటీవల ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ముందుకొచ్చారంటున్నారు.
-
మార్కెట్కు ధన్తేరాస్ కళ l తక్కువ ధరలతో ఉత్సాహం
-
అమ్మకాలు రూ.60,000 కోట్లను తాకవచ్చన్న అంచనాలు
ముంబై/న్యూఢిల్లీ, నవంబర్ 6: మార్కెట్లో ధన్తేరాస్ (ధనత్రయోదశి) సందడి కనిపించింది. శుక్రవారం బంగారం, వెండికి భారీ డిమాండ్ నమోదైనట్టు నగల వ్యాపారులు తెలిపారు. ఇటీవల ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ముందుకొచ్చారంటున్నారు. దీంతో ఈసారి బంగారం అమ్మకాల విలువ 15-20 శాతం పెరిగి సుమారు రూ.60,000 కోట్లకు చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పరిమాణం దాదాపు స్థిరంగానే ఉండవచ్చని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) చైర్మన్ రాజేశ్ రోక్డే అన్నారు.
నిరుడు ధన్తేరాస్ రోజుకంటే ఈసారి బంగారం ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. కాగా, దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే ధన్తేరాస్ను హిందూ సంప్రదాయంలో పసిడి, వెండి తదితర విలువైన లోహాల కొనుగోలుకు శుభదినంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టే ప్రముఖ జ్యుయెల్లర్స్తోపాటు చిన్నచిన్న వ్యాపారులూ రకరకాల ఆఫర్లను తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే తయారీ, తరుగు చార్జీల్లో 50 శాతం తగ్గింపు.. బంగారం కొన్నవారికి, దానికి సమాన బరువుతో వెండి ఉచితంగా ఇవ్వడం.. నిర్ణీత కొనుగోళ్లపై ఆకర్షణీయ రాయితీలు.. బంపర్/లక్కీ డ్రాలు ఇలా.. అనేకం కనిపించాయి.
దిగొచ్చిన పుత్తడి, వెండి రేట్లుబంగారం, వెండి ధరలు మరింత దిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.2,500 తగ్గి రూ.1,46,300 (అన్ని పన్నులతో కలిపి) పలికింది. కిలో వెండి రేటు కూడా రూ.2,000 పడిపోయి రూ.1,92,500 (అన్ని పన్నులతో కలిపి)గా నమోదైంది. గత ఏడాది అక్టోబర్ 18 ధన్తేరాస్ రాగా..
నాడు బంగారం రేటు రూ.1,32,400, వెండి ధర రూ.1,70,000 పలికాయి. అయితే ఈ ఏడాది జనవరి 29న మునుపెన్నడూ లేనివిధంగా గోల్డ్ రూ.1,83,000, సిల్వర్ రూ.4,04,500కు చేరాయి. అప్పటితో చూస్తే ఇప్పుడు చాలా వరకే తగ్గాయని చెప్పవచ్చు. ఇదిలావుంటే హైదరాబాద్లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రూ.1,31,500, కిలో వెండి రూ.1,92,000గా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

