న్యూఢిల్లీ, జూలై 5: బంగారం ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రికార్డు స్థాయిలో తగ్గడంతో దేశీయంగా దిగిరానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 34 డాలర్లు లేదా 2 శాతం తగ్గి 1,770 డాలర్లకు దిగొచ్చింది. దీంతో బుధవారం దేశీయంగా ధరలు రెండు శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నది.
దీంతోపాటు బ్రెంట్ క్రూడాయిల్ ధర కూడా 9 శాతం లేదా 10 డాలర్లు తగ్గి 103 డాలర్లకు పడిపోవడంతో కూడా అతి విలువైన లోహాల ధరలు తగ్గడానికి పరోక్షంగా దోహదం చేయనున్నది. కానీ, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనమవడం కొంతమేర ప్రభావాన్ని చూపనున్నది.